Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హాయిగా కూర్చున్న బాలికకు ఊహించని ప్రమాదం.. తర్వాతేం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:43 PM
చాలా మంది ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి బీచ్‌లకు వెళ్తుంటారు. సముద్రపు ఒడ్డునా చక్కగా సేద తీరుతుంటారు. అయితే సముద్రపు ఒడ్డున కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియో చూస్తే షాక్‌కు గురి కావాల్సిందే.

చాలా మంది ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి బీచ్ (Beach)లకు వెళ్తుంటారు. సముద్రపు ఒడ్డున (Sea Shore) చక్కగా సేద తీరుతుంటారు. అయితే సముద్రపు ఒడ్డున కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియో చూస్తే షాక్‌కు గురి కావాల్సిందే. సముద్రపు ప్రశాంత జీవి అయిన సీ లైన్ (Sea Lion) ఓ అమ్మాయికి భయంకర అనుభవం కలుగచేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
discover.our.nature అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అమ్మాయి (Girl) సముద్రం ఒడ్డున ఉన్న సిమెంట్ గట్టుపై కూర్చుని ఉంది. అంతలో సముద్రపు నీటి నుంచి ఓ సీ లైన్ వేగంగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని పట్టుకుని లోపలికి లాగేసింది. దీంతో ఆ అమ్మాయి కేకలు వేస్తూ సముద్రంలో పడిపోయింది. వెంటనే ఆ అమ్మాయి తాత నీటిలోకి దూకి తన మనవరాలిని కాపాడాడు. ఇద్దరూ వేగంగా ఒడ్డు మీదకు వచ్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Sea lion attacks girl).
నిజానికి ఈ సీ లైన్స్ చాలా ప్రశాంత స్వభావంతో ఉంటాయి. ఎవరికీ హాని తలపెట్టవు. అయితే సంతానోత్పత్తి సమయంలో మగ సముద్ర సింహాలు తమ ఆవాసాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాయట. వాటి పరిధిలోకి మనుషులు లేదా ఇతర జంతువులు వెళితే దాడి చేస్తాయట. కాగా, ఈ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఏకంగా 27 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..