Share News

Viral Video: దొంగతనానికి ముందు యోగా.. ఓ ఆడ దొంగ వింత ప్రవర్తనకు పోలీసులు కూడా షాక్!

ABN , Publish Date - Mar 24 , 2024 | 07:54 PM

దొంగతనం చేసే ముందు ఎలాంటి వారైనా పక్కగా స్కెచ్ వేస్తారు. టైమ్ వేస్టే చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనుకుంటారు.

Viral Video: దొంగతనానికి ముందు యోగా.. ఓ ఆడ దొంగ వింత ప్రవర్తనకు పోలీసులు కూడా షాక్!

దొంగతనం (Theft) చేసే ముందు ఎలాంటి వారైనా పక్కగా స్కెచ్ వేస్తారు. టైమ్ వేస్టే చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ఓ ఆడ దొంగ (Female thief ) ప్రవర్తన చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఎందుకంటే ఆమె దొంగతనం చేయాలనుకున్న షాప్ ముందు కొద్ది సేపు యోగా (Yoga) చేసింది. ఆ దృశ్యాలు షాప్ బయట అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియో ఆస్ట్రేలియాకు సంబంధించినది. ఈ దొంగతనం మార్చి 3న జరిగింది. ఫిలిప్పా అనే బేకరీని ఓ మహిళా దొంగ టార్గెట్ చేసింది. నల్ల బట్టలు ధరించి దొంగతనానికి వచ్చింది. ఆ బేకరీ పార్కింగ్ ఏరియాలో ఆమె యోగా చేసింది. తన శరీరాన్ని నలువైపులా వంచిన తర్వాత ఆమె షాప్ లిఫ్టింగ్‌కు పాల్పడింది. బేకరి నుంచి ఫ్రెంచ్ రోల్స్‌తో సహా మరికొన్ని వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించిన యాజమాన్యం సీసీటీవీని పరిశీలించగా ఈ వీడియో బయటపడింది.

Viral Video: మనం రోజూ ఉపయోగించే కత్తెర తయారీ వెనుక ఇంత శ్రమ ఉందా? వైరల్ వీడియో చూడండి..

వెంటనే పోలీసులు రంగంలోకి ఆ మహిళా దొంగను అరెస్ట్ చేశారు. దొంగతనం, దోపిడీ ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం కోర్టు బెయిల్‌పై ఆమె విడుదల అయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ``క్రీమ్ రోల్స్ దొంగిలించబోయే ముందు కొన్ని క్యాలరీలు బర్న్ చేయాలనేది ఆమె ప్లాన్``, ``మనం కూడా డ్యూటీకి వెళ్లే ముందు యోగా చేయాలి``, ``ఆమె కచ్చితంగా కెమేరా ముందుకు వచ్చి అలా ఎందుకు చేసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 07:54 PM