Share News

Viral Video: ఈ కాలం కుర్రాళ్లతో అలాగే ఉంటుంది మరి.. టెన్త్ చదువుతున్న కొడుకును తిడితే తండ్రి చరిత్ర బట్టబయలు..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:13 PM

ప్రస్తుత పరీక్షా సీజన్‌లో ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల ఫన్నీ జవాబులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మార్క్స్ షీట్ వైరల్ అవుతోంది. అయితే అది ఇప్పటిది కాదు.. 1990 నాటిది.

Viral Video: ఈ కాలం కుర్రాళ్లతో అలాగే ఉంటుంది మరి.. టెన్త్ చదువుతున్న కొడుకును తిడితే తండ్రి చరిత్ర బట్టబయలు..!
10th marks

ప్రస్తుత పరీక్షా (Exams) సీజన్‌లో ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల ఫన్నీ జవాబులకు సంబంధించిన వీడియోలు (Funny Videos) నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మార్క్స్ షీట్ వైరల్ అవుతోంది. అయితే అది ఇప్పటిది కాదు.. 1990 నాటిది. పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి అంటూ ఓ తండ్రి పెడుతున్న టార్చర్‌ను భరించలేక.. ఓ కుర్రాడు చేసిన పని ఇది. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Videos).


@desi_bhayo88 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఓ మార్క్ షీట్ కనిపిస్తోంది. అది పదో తరగతి మార్క్స్ షీట్ (10th Marks). అందులోని వ్యక్తి అన్ని సబ్జెక్టు‌ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. ఆ వీడియోలో ఓ కుర్రాడు మాట్లాడిన మాటలు వింటే నవ్వకుండా ఉండలేం. ``పదో తరగతి పాస్ కావాలి.. పాస్ కావాలి.. అంటూ మా నాన్న అరుస్తుంటారు ఫ్రెండ్స్. ఇది వారి పదో తరగతి మార్క్స్ షీట్`` అని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.10 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 5 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``నువ్వు కూడా మీ నాన్నలా ఫెయిల్ కావాలనుకుంటున్నావా``, ``నువ్వైనా బాగా చదువుకోవాలని మీ నాన్న కోరుకుంటున్నాడు``, ``కొడుకుతో పెట్టుకుంటే తండ్రి చరిత్ర బయటపడింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ వ్యక్తి తెలివితేటలకు ఫిదా కావాల్సిందే.. కార్ సైడ్ మిర్రర్ పగిలినపుడు ఏ చేశాడంటే..


Viral Video: వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే.. గాల్లో ఎగురుతూ ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2024 | 04:14 PM