Share News

Viral Video: మీ ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? ఈ వీడియో చూస్తే భయపడాల్సిందే..

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:41 PM

ఈవీ స్కూటర్లు చార్జింగ్ సమయంలో కాలిపోతున్నాయనే వార్తలు అప్పట్లో వినియోగదారులను భయపెట్టాయి. అయితే అలాంటి ఘటనలు పునరావృతం కాకపోవడంతో క్రమేపీ ఆ భయం పోయింది.

Viral Video: మీ ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? ఈ వీడియో చూస్తే భయపడాల్సిందే..

పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోవడంతో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (EV Scooters) వాడకం పెరిగింది. ఉదయం అంతా వాడుకుని రాత్రిళ్లు ఛార్జింగ్ (Charging) పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఈవీ స్కూటర్లు చార్జింగ్ సమయంలో కాలిపోతున్నాయనే వార్తలు అప్పట్లో వినియోగదారులను భయపెట్టాయి. అయితే అలాంటి ఘటనలు పునరావృతం కాకపోవడంతో క్రమేపీ ఆ భయం పోయింది. పల్లెటూళ్లలో కూడా ఈవీ స్కూటర్లను వాడుతున్నారు.

ఈవీ స్కూటర్లకు సంబంధించి ప్రస్తుతం ఓ భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈవీ స్కూటర్‌కు సంబంధించి రిమూవబుల్ బ్యాటరీని ఇంటి లోపల ఛార్జ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ వ్యాపిస్తూ మొత్తం రూమ్ అంతా మంటలు చెలరేగాయి. ఆ రూమ్‌లో ఉన్న ప్రతి వస్తువూ కాలిపోయింది. దీంతో ఆ ఇంట్లోని వారు కిటికీ దగ్గరకు వెళ్లి ఇతరులను సహాయం కోసం పిలిచారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి. 2.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ బ్యాటరీ బ్రాండ్ ఏంటి``, ``ఈ ప్రమాదాన్ని ఎలా అరికట్టాలి``, ``అంత కఠిన పరిస్థితుల్లో కూడా వీడియో రూపొందించడం గ్రేట్``, ``ఎలక్ట్రిక్ బైక్‌లు సేఫ్ కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 11 , 2024 | 03:43 PM