E-motorcycle: రాప్టీ ఎనర్జీ నుంచి హైఓల్టేజ్ ఈ-మోటర్ సైకిల్
ABN , Publish Date - Jan 12 , 2024 | 09:08 AM
ఎలక్ట్రిక్ వాహనాల స్టార్ట్‌అప్ కంపెనీ రాప్టీ తన హై ఓల్టేజీ ఈ- మోటర్ సైకిల్(E-motorcycle)ను ఈ యేడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్ వాహనాల స్టార్ట్‌అప్ కంపెనీ రాప్టీ తన హై ఓల్టేజీ ఈ- మోటర్ సైకిల్(E-motorcycle)ను ఈ యేడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఆ కంపెనీ తయారు చేసిన ఈ- మోటరు సైకిల్‌ను ఇటీవల ట్రేడ్ సెంటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా ప్రత్యేక స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ప్రశంసించినట్లు రాప్టీ ఎనర్జీ సీఈఓ దినేష్ అర్జున్ తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ చెన్నై శివార్లలోని నాలుగు ఎకరాల్లో రూ.85 కోట్ల తో ఫ్యాక్టరీని నెలకొల్పిందని ఆ సంస్థ సీబీఓ జయప్రదీప్ వాసుదేవన్ తెలిపారు. ఈ కొత్త ఎలక్ర్టిక్ మోటర్ సైకిల్ ఒక సారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సీఈవో తెలిపారు.