Share News

Viral Video: ఈ శునకం ప్రేమను చూస్తే ఫిదా అవడం పక్కా.. యజమాని కోసం ఏం చేసిందో చూడండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:27 PM

పెంపుడు జంతువులు చూపించే ప్రేమ, వాటి అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. పెంపుడు జంతువుల్లో విశ్వాసం.. అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి శునకాలే. జంతువుల్లో ఇవి ఉన్నంత విశ్వాసంగా వేరేవి ఉండవు. నాగరికత తెలియక ముందు నుంచే మనుషులకు శునకాలు మంచి స్నేహితులుగా ఉండేవి.

Viral Video: ఈ శునకం ప్రేమను చూస్తే ఫిదా అవడం పక్కా.. యజమాని కోసం ఏం చేసిందో చూడండి

ఇంటర్నెట్: పెంపుడు జంతువులు చూపించే ప్రేమ, వాటి అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. పెంపుడు జంతువుల్లో విశ్వాసం.. అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి శునకాలే. జంతువుల్లో ఇవి ఉన్నంత విశ్వాసంగా వేరేవి ఉండవు. నాగరికత తెలియక ముందు నుంచే మనుషులకు శునకాలు మంచి స్నేహితులుగా ఉండేవి. నాగరికత అలవాటయ్యాక పెంపుడు శునకాలని(Pet Dogs) ఇళ్లలో పెంచుకుంటున్నారు.

Realme: దేశంలోనే చౌకైన 5 జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన రియల్ మి.. ధర, ఫీచర్లివే


ఇవి మనుషుల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఒంటరితనాన్ని దూరం చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇవి తమ యజమానులను కొన్నిసార్లు బయటి నుంచి తలెత్తే ప్రమాదాలను గుర్తించి చాకచక్యంగా కాపాడగలుగుతాయి. అయితే తాజాగా ఓ శునకం తన యజమాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి.. చేసిన స్టంట్ చూస్తే దాని ప్రేమకు మీరు ఫిదా అవడం పక్కా. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యజమాని స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయి, ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నట్లు నటిస్తాడు. ఈ దృశ్యాలను పక్క బిల్డింగ్‌పై ఉన్న పెంపుడు శునకం చూస్తుంది.


యజమాని ప్రాణాపాయంతో ఉన్నాడని తెలిసిన శునకం వేగంగా దూసుకొచ్చి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకుతుంది. అనంతరం మునిగిపోయినట్లు నటిస్తున్న యజమాని దగ్గరికి ఈదుకుంటూ వెళ్లి అతన్ని.. ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా యజమాని ఒడ్డుకు చేరుకుంటాడు.

శునకం ప్రేమను చూసిన యజమాని దాన్ని హత్తుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. శునకాలకు యజమానులపై ఉన్న ప్రేమను ఈ వీడియో తెలియజేస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కుక్క ప్రేమకు తాను ఫిదా అయ్యానని మరొకరు కామెంట్ చేశారు. అంతకుముందు, విషపూరితమైన నాగుపాము నుంచి పిల్లవాడిని శునకం రక్షిస్తున్న మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 12:28 PM