Share News

Clothes Caring Tips: డ్రెస్‌లను ఇలా మడతపెట్టండి.. సేఫ్‌గా, కొత్తగా ఉంటాయి..!

ABN , Publish Date - Feb 20 , 2024 | 10:37 AM

Clothes Caring Tips: సీజన్‌కు తగ్గట్లుగా ప్రజలు దుస్తులు ధరిస్తుంటారు. సీజన్(Winter Season) అయిపోగానే.. ఆ దుస్తులు(Dresses) మడతపెట్టి జాగ్రత్తగా దాచి పెడతారు. ప్రస్తుతం శీతాకాలం ముగిసిపోతుంది. వేసవి కాలం(Summer) వచ్చేస్తోంది. సో.. వింటర్ దుస్తులను పక్కకు పడేసి.. వేసవికి అనుగుణమైన కాటన్ దుస్తులు వినియోగించే పరిస్థితి ఉంటుంది.

Clothes Caring Tips: డ్రెస్‌లను ఇలా మడతపెట్టండి.. సేఫ్‌గా, కొత్తగా ఉంటాయి..!
Clothes Packing Tips

Clothes Caring Tips: సీజన్‌కు తగ్గట్లుగా ప్రజలు దుస్తులు ధరిస్తుంటారు. సీజన్(Winter Season) అయిపోగానే.. ఆ దుస్తులు(Dresses) మడతపెట్టి జాగ్రత్తగా దాచి పెడతారు. ప్రస్తుతం శీతాకాలం ముగిసిపోతుంది. వేసవి కాలం(Summer) వచ్చేస్తోంది. సో.. వింటర్ దుస్తులను పక్కకు పడేసి.. వేసవికి అనుగుణమైన కాటన్ దుస్తులు వినియోగించే పరిస్థితి ఉంటుంది. వింటర్‌లో వినియోగించిన దుస్తులు, స్వెట్టర్స్‌, మందపాటి డ్రెస్సులను మడిచి అల్మారాలో గానీ ఇంట్లో ఖాళీ స్థలంలో పెడతారు. అయితే, ఇలా మడతపెట్టిన దస్తులు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ధరించే ఉన్ని బట్టలు, జాకెట్స్‌ని సరిగా ప్యాక్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తద్వారా అవి చెడి పోకుండా ఉంటాయి. ఉన్ని దుస్తులను ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, వాటిని సంరక్షించడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శుభ్రంగా ఉంచాలి..

చలికాలంలో ఎక్కువ శాతం ఉన్ని దుస్తులు ధరిస్తారు. అయితే, వీటిలో జాకెట్స్, కొన్ని రకాల దుస్తులను రోజూ ఉతకనివి కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ దుస్తులపై దుమ్ము, దూళి భారీగా పెరుకుపోతుంది. అందుకే.. ఉన్ని దుస్తులను ప్యాక్ చేయడానికి ముందు వాటిని వాష్ చేయాలి. కుదిరితే ఉతికాలి. లేదంటే.. ఎండలో ఆరబెట్టి.. బ్రష్‌తో శుభ్రం చేయాలి. దుమ్ము దులపాలి. అనంతరం దానిని ప్యాక్ చేయాలి.

సరిగ్గా మడతపెట్టాలి..

శీతాకాలంలో ధరించే ప్రత్యేక దుస్తులను భద్రపరిచేటప్పుడు సరిగ్గా మడవాలి. దుస్తులు సరిగా మడతపెట్టకపోతే అవి ముడతలు పడుతాయి. దీని కారణంగా అవి చెడిపోయే అవకాశం ఉంది. ఉన్ని కోటు, జాకె, వెచ్చని దుస్తులు కాస్త బరువుగా ఉంటాయి. వీటిని సరిగా మడతపెట్టకపోతే ప్యాకింగ్ చేయడం, నిర్వహణలో ఇబ్బంది ఏర్పడుతుంది.

నాఫ్తలీన్ గోళీలు..

చాలా మంది ప్రజలు తమ దుస్తులు పాడవకుండా ఉండేందుకు, చెదలు పట్టకుండా ఉండేందుకు నాఫ్తలిన్ బాల్స్‌ని వాటి మధ్యలో పెడుతుంటారు. కానీ, దుస్తుల మధ్య నాప్తలిన్ గోళీలు పెట్టడం సరికాదని చెబుతున్నారు నిపుణులు. అల్మారాలో, షెల్ఫ్‌లో నాలుగు మూలల్లో ఒక్కొక్కటి చొప్పున నాఫ్తలీన్ బాల్స్‌ని ఉంచాలి. అలాగే దీనిని ఎక్కువగా ఉపయోగించొచ్చు. దీని వల్ల బట్టల్లో దుర్వాసన వస్తుంది. నాఫ్తలిన్ బాల్స్‌ని సన్నని కాటన్ క్లాత్‌లో కట్టి అల్మారా, షెల్ఫ్‌లో పెట్టాలి. వేప ఆకులు, వేప నూనె, కొన్ని చుక్కల లావెండర్ నూనెను కాటన్‌ ప్యాడ్‌కు అప్లై చేసి దుస్తుల పెట్టే చోట పెట్టొచ్చు.

కాగితంలో ప్యాకింగ్..

కొంతమంది బట్టలు నేరుగా ప్లాస్టిక్ సంచుల్లో పెడతారు. ఇలా చేయడం వల్ల దుస్తులు పాడయ్యే అవకాశం ఉంది. అందుకే చలికాలపు దుస్తులను ఫోల్డ్ చేసేటప్పుడు ముందుగా వాటిని వార్తా పత్రికలో ఫోల్డ్ చేయాలి. ఆ తరువాత ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి. దుస్తులు ఒకటి కంటే ఎక్కువ ఉంటే.. వాటి మధ్య కాగితం పెట్టి.. ఆ తరువాత ప్లాస్టిక్ సంచిలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల తేమ, ఫంగస్ రాకుండా ఉంటుంది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 10:37 AM