Share News

Chennai: తమిళనాడులో పట్టుబడిన తెలుపురంగు గుడ్లగూబ

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:54 PM

తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడి వద్ద అరుదైన తెలుపురంగు గుడ్లగూబ పట్టుబడింది. ఉడన్‌కుడి సమీపం చిల్లూరులో ఆ తెల్లని గుడ్లగూబను కాకులు తరుముకువచ్చాయి.

Chennai: తమిళనాడులో పట్టుబడిన తెలుపురంగు గుడ్లగూబ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడి వద్ద అరుదైన తెలుపురంగు గుడ్లగూబ పట్టుబడింది. ఉడన్‌కుడి సమీపం చిల్లూరులో ఆ తెల్లని గుడ్లగూబను కాకులు తరుముకువచ్చాయి. చివరకు ఆ గుడ్లగూబ విజయన్‌(Vijayan) అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పడింది. గమనించిన విజయన్‌ కాకుల బారి నుంచి దాన్ని కాపాడాడు. అతడి సోదరుడు జయరాజ్‌ ఆ గుడ్లగూబను వీడియో తీసి సోషల్‌ మీడియాలో వెలువరించారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ వీడియోను చూసి వెంటనే విజయన్‌ ఇంటికి వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ గుడ్లగూబ అరుదైన జాతికి చెందినదని, పగటిపూట దానికి కళు కనపడవని, కనుకనే కాకులు తరుముకుంటూ వచ్చాయని, అయితే రాత్రిపూట దానికి కళ్ళు బాగా కనబడటమే గాకుండా పక్షులను తరిమికొడుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 12:54 PM