Share News

Viral Video: ఈ బాల్ ఆడడం సచిన్‌కు కూడా సాధ్యం కాదేమో.. ఎంతలా స్పిన్ అయిందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Feb 12 , 2024 | 04:26 PM

ఉప ఖండపు పిచ్‌లపై స్పిన్నర్లను ఆడడం అంత సులభం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బాల్ భారీగా స్పిన్ అయి వికెట్లను పడగొట్టింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Viral Video: ఈ బాల్ ఆడడం సచిన్‌కు కూడా సాధ్యం కాదేమో.. ఎంతలా స్పిన్ అయిందో చూడండి.. వీడియో వైరల్!

ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్ అయినా స్పిన్ (Spin) బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడతాడు. అనూహ్యంగా స్పిన్ అయ్యే బంతులు ఎలాంటి వారికైనా చెమటలు పట్టిస్తాయి. ముఖ్యంగా ఉప ఖండపు పిచ్‌లపై స్పిన్నర్లను ఆడడం అంత సులభం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ బాల్ భారీగా స్పిన్ అయి వికెట్లను పడగొట్టింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కేసీసీ T20 ఛాలెంజర్స్ కప్ 2024లో భాగంగా కువైట్ నేషనల్స్, ఎస్‌బీఎస్ సీసీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఎస్‌బీఎస్ సీసీ బియాంత్ సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా కువైట్ నేషనల్స్‌ స్పిన్నర్ ముహమ్మద్ వకార్ బౌలింగ్‌కు దిగాడు. విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో వకార్ ఆఫ్‌సైడ్ ఓ బంతిని వేశాడు. ఆ బంతిని ఆడేందుకు బియాంత్ ఆఫ్ వికెట్‌ వైపు కదిలాడు. అయితే అనూహ్యంగా ఆ బంతి స్పిన్ అయి వికెట్లను పడగొట్టింది. ఆ బంతి విపరీతంగా స్పిన్ అయి బ్యాట్స్‌మెన్‌నే కాదు, చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ బాల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఆ బాల్‌పై క్రికెట్ ప్రేమికులు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది డెలివరీ ఆఫ్ ది సెంచరీ``, ``ఆ బంతి కువైట్ నుంచి ఒమన్‌కి స్పిన్ అయింది``, ``మురళీధరన్, హర్భజన్ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు``, ``మురళీధరన్ అల్ట్రా ప్రో``, ``ఈ బంతిని సచిన్, ద్రవిడ్ కూడా ఆడలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.3 లక్షల మందికి పైగా వీక్షించారు.

Updated Date - Feb 12 , 2024 | 04:26 PM