Share News

Viral: హై-ప్రోటీన్ భోజనం నేర్పడానికి స్టార్టప్.. బెంగళూరు మహిళ వినూత్న ఆలోచన..

ABN , Publish Date - Dec 07 , 2024 | 01:37 PM

బెంగళూరుకు చెందిన ఓ మహిళ కొత్త స్టార్టప్ ఐడియాను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా మరికొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral: హై-ప్రోటీన్ భోజనం నేర్పడానికి స్టార్టప్.. బెంగళూరు మహిళ వినూత్న ఆలోచన..

ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సమతుల్యమైర ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ, ప్రస్తుత కాలంలో ఎక్కువగా బయట దొరుకుతున్న నాణ్యత లేని ఫుడ్ ను తినేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. అయితే, అలా నాణ్యత లేని ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనిహెచ్చరిస్తున్నారు.


ప్రొటీన్లు కలిగిన ఆహారం..

ప్రస్తుత కాలంలో ప్రొటీన్లు కలిగిన ఆహారం దొరకడం కష్టంగా మారడంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ కొత్త స్టార్టప్ ఐడియాను తన సోషల్ మీడియాలో పంచుకుంది. అమృత అనే మహిళ కొత్త స్టార్టప్ ఐడియాను ట్విట్టర్ లో పంచుకుంటూ.. అధిక ప్రొటీన్లు కలిగిన సమత్యుల ఆహారాన్ని తయారు చేసేందుకు వంటవారికి శిక్షణ ఇవ్వాలి అనే ఆలోచనను ప్రతిపాదించింది. హై ప్రొటీన్ మీల్స్ ను ఎలా చేయాలో పనిమనిషికి, వంట చేసేవారికి నేర్పించే 'అన్ టాప్డ్ మార్కెట్' స్టార్టప్ అని వివరించింది.


ఈ పోస్ట్ పై కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసించగా మరికొందరు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వంటవారికి ఇలా శిక్షణ ఇవ్వడం చాలా మంచి ఆలోచన అని కొందరు కామెంట్స్ చేయగా మరికొందరూ అలా వంట చేయడం నేర్చించే బదులుగా స్వయంగా తననే వంట చేయమని కోరారు. కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే అమృత ఇలా స్టార్టప్ అంటోందని మండిపడ్డారు.

Updated Date - Dec 07 , 2024 | 01:38 PM