Share News

Bangalore: అయోధ్య రాముడికి ఉడతా భక్తి.. 15 అడుగుల ఉడత విగ్రహాన్ని కానుకగా పంపిన ఇంజనీర్‌

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:01 PM

అయోధ్యలో ఈనెల 22న భవ్య రామమందిరం ప్రారంభం కానుండడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికుతున్నాయి. శ్రీరామచంద్రుడికి రకరకాల రూపాల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటున్నారు.

Bangalore: అయోధ్య రాముడికి ఉడతా భక్తి.. 15 అడుగుల ఉడత విగ్రహాన్ని కానుకగా పంపిన ఇంజనీర్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో ఈనెల 22న భవ్య రామమందిరం ప్రారంభం కానుండడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికుతున్నాయి. శ్రీరామచంద్రుడికి రకరకాల రూపాల్లో భక్తులు కానుకలు సమర్పించుకుంటున్నారు. తాజాగా బెంగళూరు(Bangalore) పీణ్యాకు చెందిన ఇంజనీర్‌ సి. ప్రకాశ్‌ తాను కూడా ఓ ఉడతా భక్తి కానుకను సమర్పించుకోదలిచారు. ఇందులో భాగంగా రెండున్నర టన్నుల కార్టన్‌ స్టీల్‌తో 15 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల వెడల్పు కల్గిన ఉడత విగ్రహాన్ని సిద్ధం చేశారు. అయోధ్య(Ayodhya)లో ఆధునికీకరించిన రైల్వే స్టేషన్‌లో దీన్ని ఈనెల 12న ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ట్రక్కులో ఈ ఉడతను శనివారం ఉదయం అయోధ్యకు తరలించారు. 11 ఉదయానికల్లా అయోధ్యకు చేరుకుంటుందని ప్రకాశ్‌ మీడియాకు తెలిపారు. రామాయణంలో రామసేతు నిర్మాణంలో చిన్నచిన్న ప్రాణులు కూడా సేవలందించాయని, పురాణ కథలు కూడా ఉటంకిస్తున్నాయి. అందులో ఒక ఉడత కూడా సేవ చేయడంతో అదే నేటికీ ఉడతాభక్తిగా పేర్కొంటారు.

Updated Date - Jan 07 , 2024 | 01:01 PM