Share News

Viral: చనిపోయిన భర్త వీర్యం కోసం 62 ఏళ్ల మహిళ న్యాయపోరాటం.. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే..

ABN , Publish Date - Jan 03 , 2024 | 07:03 PM

ఆస్ట్రేలియాకు చెందిన ఓ 62 ఏళ్ల మహిళ చనిపోయిన తన భర్త నుంచి పిల్లలను కనాలనుకుని చేస్తున్న న్యాయపోరాటం సఫలీకృతమైంది. ఆమె అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. 31 ఏళ్ల కొడుకు, 29 ఏళ్ల కుమార్తె వరుస ప్రమాదాల్లో చనిపోవడంతో ఆమె కుంగిపోయింది.

Viral: చనిపోయిన భర్త వీర్యం కోసం 62 ఏళ్ల మహిళ న్యాయపోరాటం.. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే..

ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ఓ 62 ఏళ్ల మహిళ చనిపోయిన తన భర్త నుంచి పిల్లలను కనాలనుకుని చేస్తున్న న్యాయపోరాటం సఫలీకృతమైంది. ఆమె అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. 31 ఏళ్ల కొడుకు, 29 ఏళ్ల కుమార్తె వరుస ప్రమాదాల్లో చనిపోవడంతో ఆమె కుంగిపోయింది. సరోగసీ (Surrogacy) విధానంలో మరో బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అందుకు ఆమె భర్త కూడా అంగీకరించాడు. అయితే అనుకోకుండా ఆమె భర్త గత నెల 17వ తేదీన మరణించాడు.

చనిపోయిన తన భర్త శరీరం నుంచి వీర్యం (Sperm) సేకరించి ఆసుపత్రి మార్చురీలో భద్రపరచాలని అభ్యర్థించింది. హాస్పిటల్ వర్గాలు అందుకు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. మరణం తర్వాత రెండు రోజుల లోపే వీర్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీంతో ఆ మహిళ పశ్చిమ ఆస్ట్రేలియా సుప్రీం కోర్ట్‌లో (Court) అత్యవసర ఆర్డర్‌ వేసింది. న్యాయామూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చారు. వెంటనే ఆమె భర్త శరీరం నుంచి వీర్యం సేకరించాలని ఆదేశించారు.

వీర్యం సేకరించడం వరకు ఫర్వాలేదు కానీ, దానిని ఫలదీకరణం కోసం ఉపయోగించే ముందు ఇతర కోర్టు ఆమోదాలు కూడా అవసరం. తాజాగా ఆ అనుమతి కూడా ఆమెకు లభించింది. దీంతో ఆ 62 ఏళ్ల మహిళ సరోగసీ విధానంలో బిడ్డను కనబోతోంది.

Updated Date - Jan 03 , 2024 | 07:03 PM