Share News

Viral Video: ఇంకా ఇలాంటి గ్రామాలున్నాయా? ఆ ఊళ్లో పానీపూరీలను ఎలా కొంటున్నారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ABN , Publish Date - May 27 , 2024 | 03:06 PM

మీరు ఏదైనా కొనాలనుకుంటే ఎలా కొంటారా? డబ్బులిచ్చి కొనుక్కుంటారు. లేదా ప్రస్తుత డిజిటల్ యుగంలో యూపీఐ లావాదేవీ నిర్వహిస్తారు. అయితే ఈ డబ్బులు చెలామణిలో లేనప్పుడు ప్రజలు క్రయవిక్రయాలు ఎలా జరిపేవారు? దాని గురించి అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటారు..

Viral Video: ఇంకా ఇలాంటి గ్రామాలున్నాయా? ఆ ఊళ్లో పానీపూరీలను ఎలా కొంటున్నారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Grains for Paipuri

మీరు ఏదైనా కొనాలనుకుంటే ఎలా కొంటారా? డబ్బులిచ్చి (Money) కొనుక్కుంటారు. లేదా ప్రస్తుత డిజిటల్ యుగంలో యూపీఐ లావాదేవీ నిర్వహిస్తారు. అయితే ఈ డబ్బులు చెలామణిలో లేనప్పుడు ప్రజలు క్రయవిక్రయాలు ఎలా జరిపేవారు? దాని గురించి అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. వస్తువుకు బదులుగా మరో వస్తువును ఇచ్చేవారు. దానినే వస్తు మార్పిడి విధానం (Barter system) అంటారు. డబ్బులు చెలామణిలోకి వచ్చాక ఆ వస్తు మార్పిడి విధానం పూర్తిగా తెరమరుగైంది (Viral Video).


పట్టణాల్లో ఇలాంటి వస్తు మార్పిడి విధానం ఎవరికీ తెలియదు గానీ, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అది అమలవుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ విషయాన్ని నమ్మక తప్పదు. ఆ వీడియోలో పానీపూరీ (Panipuri) అమ్ముతున్న ఓ వ్యక్తి కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోవడం లేదు. వారు పండించుకున్న గోధుమలను తీసుకుని పానీపూరీలు ఇస్తున్నాడు. midnight_travel_without_money అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Grains for Paipuri).


ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి. 1.17 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మేము కూడా మా గ్రామంలో ఇలాగే చేసేవాళ్లం``, ``మా చిన్నప్పుడు కూరలు ఇచ్చి ధాన్యం కొనుక్కునేవాళ్లం``, ``ఈ పానీపూరీలు చాలా ఖరీదెక్కువ. ప్లేట్ నిండైన ధాన్యానికి కేవలం 9 పానీపూరీలు మాత్రమే వచ్చాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో 280 నెంబర్ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: దయచేసి పిల్లల్ని ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి.. ఈ వీడియోలో పిల్లాడికి ఏం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2024 | 03:19 PM