Share News

Viral Video: ఆకాశంలో అద్భుతం.. స్కాట్లాండ్ గగనతలంపై హరివిల్లు మేఘాలు.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jan 03 , 2024 | 09:10 PM

స్కాట్లాండ్ గగనతలంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. స్కాట్లాండ్‌ వాసులు ఆకాశంలో ఇంద్రధనస్సు రంగులతో కూడిన అరుదైన మేఘాలను, సహజ కాంతి ప్రదర్శనను వీక్షించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అద్భుత వీడియోను నైర్న్ బీచ్ సమీపంలో చిత్రీకరించారు.

Viral Video: ఆకాశంలో అద్భుతం.. స్కాట్లాండ్ గగనతలంపై హరివిల్లు మేఘాలు.. వీడియో వైరల్!

స్కాట్లాండ్ (Scotland) గగనతలంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. స్కాట్లాండ్‌ వాసులు ఆకాశంలో ఇంద్రధనస్సు రంగులతో కూడిన అరుదైన మేఘాలను (Rainbow Clouds), సహజ కాంతి ప్రదర్శనను వీక్షించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అద్భుత వీడియోను నైర్న్ బీచ్ సమీపంలో ఉదయం 9 గంటల సమయంలో జాషువా ఎర్లే అనే 29 ఏళ్ల ఫోటోగ్రాఫర్ చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను అబ్బురపరుస్తోంది. స్కాట్లాండ్ దేశవ్యాప్తంగా ఈ మేఘాలు కనువిందు చేశాయి (Viral Video).

``ఈ వారం యూకే (UK) అంతటా ఈ అద్భుతమైన మేఘాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి అద్భుతమైనది. వీటిని మదర్ ఆఫ్ పెర్ల్, పోలార్ స్ట్రాటో ఆవరణ మేఘాలు అని కూడా పిలుస్తారు. చిన్న మంచు స్ఫటికాలతో కూడిన అధిక ఆర్కిటిక్ మేఘాలపై సూర్యరశ్మి పరావర్తనం చెందడం వల్ల ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. మీరు యూకేలో ఉన్నట్టైతే ఈ వారంలో సూర్మరశ్మిని చూడడం గొప్ప అరుదైన అనుభూతి`` అని ఎర్లే పేర్కొన్నారు.

ఎర్లే పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 38 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.7 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ``వాటిని పోలార్ స్ట్రాటో ఆవరణ మేఘాలు అని పిలుస్తారు``, ``గాలిలోని రసాయనాల వల్ల కూడా అవి ఏర్పడతాయి``, ``ఇలాంటి దృశ్యం చూడడం గొప్ప అదృష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 09:10 PM