Share News

Mukesh Ambani: వాచ్‌మెన్‌పై అరిచిన ఆకాష్ అంబానీ.. అక్కడే ఉన్న ముఖేష్ ఏం చేశారంటే..

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:19 PM

రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, అజీమ్ ప్రేమ్‌జీ, ముఖేష్ అంబానీ.. భారతదేశం గర్వించదగిన అతి కొద్ది మంది వ్యాపారవేత్తలో కొందరు. ధీరూభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా పొందిన వ్యాపార సామ్రాజ్యాన్ని ముఖేష్ అంబానీ ఎన్నో రెట్లు పెంచారు.

Mukesh Ambani: వాచ్‌మెన్‌పై అరిచిన ఆకాష్ అంబానీ.. అక్కడే ఉన్న ముఖేష్ ఏం చేశారంటే..

రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, అజీమ్ ప్రేమ్‌జీ, ముఖేష్ అంబానీ.. భారతదేశం గర్వించదగిన అతి కొద్ది మంది వ్యాపారవేత్తలో కొందరు. ధీరూభాయ్ అంబానీ నుంచి వారసత్వంగా పొందిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎన్నో రెట్లు పెంచిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రూ. 841627 కోట్ల నికర విలువతో అత్యంత ధనవంతులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ముఖేష్ తరహాలోనే ఆయన పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ కూడా రిలయన్స్ వ్యాపార (Reliance) సామ్రాజ్యంలో చేరారు.

జియో విజయవంతం కావడంలో తన పిల్లల పాత్ర ఎనలేనిదని ముఖేష్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. పిల్లల వ్యాపార దక్షత మాత్రమే కాదు, ప్రవర్తన కూడా సరైన విధానంలోనే ఉంటుందని వారి తల్లి నీతా అంబానీ చెప్పారు. సిమీ గరేవాల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను ఆమె పంచుకున్నారు. ``ఆకాష్ (Akash Ambani) ఒకసారి మా వాచ్‌మెన్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆకాష్ తన స్వరాన్ని పెంచి వాచ్‌మెన్‌పై కేకలు వేస్తున్నాడు. ఆకాష్ అలా చేయడం ముఖేష్ విన్నారు. ఆకాష్‌ను మందలించి వెంటనే కిందకు వెళ్లి వాచ్‌మెన్‌కు సారీ చెప్పాలని అన్నార``ని నీతా చెప్పారు.

వెంటనే అకాష్ కిందకు వెళ్లి వాచ్‌మెన్‌కు (Watchman) సారీ చెప్పాడని, అతను మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మారడానికి ఆ చర్య చాలా దోహదపడిందని నీతా తెలిపారు. ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముంబైలోని రూ. 15000 కోట్ల యాంటిలియా భవనంలో ఆకాష్ కుటుంబం నివసిస్తోంది.

Updated Date - Jan 08 , 2024 | 06:07 PM