Share News

Viral Video: మా గేదెలకు ఇలాగే గడ్డి వేస్తాను.. నూడిల్స్ తయారు చేస్తున్న వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం..!

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:00 PM

ఏ వేడుకలో అయినా అతిథులకు మంచి రుచి గల ఆహారం అందించాలని అందరూ అనుకుంటారు. అయితే రుచితో పాటు పరిశుభ్రత కూడా ముఖ్యమేనని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నిరూపిస్తోంది.

Viral Video: మా గేదెలకు ఇలాగే గడ్డి వేస్తాను.. నూడిల్స్ తయారు చేస్తున్న వ్యక్తిపై నెటిజన్ల ఆగ్రహం..!

పార్టీ అయినా పండగ అయినా, వేడుక ఏదైనా ఆహారంతో (Food) సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఆచారం. అతిథులకు మంచి రుచి గల ఆహారం అందించాలని అందరూ అనుకుంటారు. అయితే రుచితో పాటు పరిశుభ్రత కూడా ముఖ్యమేనని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) నిరూపిస్తోంది. ఆ వీడియోలో నూడిల్స్ (Noodles) తయారు చేస్తున్న వ్యక్తి నిర్వాకంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో (Noodles Making Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

mh_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఒక వేడుకలో ఓ వ్యక్తి నూడుల్స్ సిద్ధం చేస్తున్నాడు. అయితే అతడు గరిటెని ఉపయోగించకుండా తన చేతులతో నూడిల్స్ కలిపేస్తున్నాడు. ఆ చేతులతోనే మొహం రాసుకుంటున్నాడు. మళ్లీ అదే చేతులతో మూకుడులోని నూడిల్స్ కలిపేస్తున్నాడు. అతడి నిర్వాకాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.

ఈ వైరల్ వీడియోకు లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``నేను నా గేదెకు ఇలాగే తినిపిస్తాను``, ``బ్రదర్.. అతిథుల పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించకూడదు``, ``అతడి దగ్గర ఇంకో గరిటె లేనట్టు ఉంది``, ``ఫ్రీగా నూడిల్స్ తినాలంటే ఇలాంటివి భరించాలి``, ``ఆ వ్యక్తి తన చెమటతో నూడిల్స్ రెడీ చేస్తున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 04:00 PM