Share News

Viral Video: ఫ్రిడ్జ్, కూలర్‌తో వెరైటీ ఏసీ తయారు చేసిన వ్యక్తి.. నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..!

ABN , Publish Date - May 03 , 2024 | 11:44 AM

ప్రస్తుతం దేశంలో ఎండలు (Summer) వేడెక్కిస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో సగటున 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారు.

Viral Video: ఫ్రిడ్జ్, కూలర్‌తో వెరైటీ ఏసీ తయారు చేసిన వ్యక్తి.. నెటిజన్లు ఎందుకు తిడుతున్నారంటే..!
Jugaad AC

ప్రస్తుతం దేశంలో ఎండలు (Summer) వేడెక్కిస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో సగటున 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే (Viral Video). ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫ్రిడ్జ్, కూలర్ ఉపయోగించి ఓ వైరైటీ ఏసీని (Jugaad AC) తయారు చేశాడు.


@WokePandemic అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫ్రిడ్జ్ (Fridge) డోర్ తెరిచి దాని ముందు ఓ కూలర్‌ (Cooler)ను ఉంచాడు. దాని ఎదురుగా మంచం వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ఫ్రిడ్జ్ నుంచి వచ్చే చల్ల గాలిని కూలర్ అతడి వైపు పంపిస్తోంది. ఈ వెరైటీ ట్రిక్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 26 లక్షల మందికి పైగా వీక్షించారు. 5 వేల మందికి పైగా లైక్ చేశారు.


ఆ ట్రిక్‌ను చాలా మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. అది పని చెయ్యదని కామెంట్లు చేస్తున్నారు. ``ఆ వ్యక్తికి థెర్మో డైనమిక్స్ తెలియదు. ఈ ఏర్పాటు రూమ్‌ను మరింత వేడిగా చేస్తుంది``, ``దీని వల్ల మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఫ్రిడ్జ్ కూడా పాడైపోతుంది``, ``ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండకపోగా కరెంటు బిల్లు ఓ రేంజ్‌లో వస్తుంది``, ``ఇది పిచ్చి ట్రిక్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: కూతురి బెడ్రూమ్ నుంచి వింత శబ్దాలు.. తల్లిదండ్రులు చెక్ చేస్తే బయటపడిన షాకింగ్ విషయం..!


Puzzle: మీ కళ్లకు టెస్ట్.. పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థి ఎవరో 5 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2024 | 11:44 AM