Share News

Jugaad: ఈ కుర్రాడి ట్యాలెంట్ మామూలుగా లేదు.. నెంబర్ ప్లేట్‌ను ఇండికేటర్‌గా మార్చేశాడు.. అతడి తెలివికి నెటిజన్లు ఫిదా!

ABN , Publish Date - Mar 24 , 2024 | 05:44 PM

సాధారణ వ్యక్తులు కూడా అప్పుడప్పుడు అమోఘమైన తెలివితేటలు ఉపయోగించి నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు. పెద్ద పెద్ద ఇంజినీర్లకు కూడా సాధ్యం కాని రీతిలో కళ్లు చెదిరే పనితనం ప్రదర్శిస్తుంటారు.

Jugaad: ఈ కుర్రాడి ట్యాలెంట్ మామూలుగా లేదు.. నెంబర్ ప్లేట్‌ను ఇండికేటర్‌గా మార్చేశాడు.. అతడి తెలివికి నెటిజన్లు ఫిదా!

సాధారణ వ్యక్తులు కూడా అప్పుడప్పుడు అమోఘమైన తెలివితేటలు ఉపయోగించి నూతన ఆవిష్కరణలు (New Innovation) చేస్తుంటారు. పెద్ద పెద్ద ఇంజినీర్లకు కూడా సాధ్యం కాని రీతిలో కళ్లు చెదిరే పనితనం ప్రదర్శిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Jugaad Video) ఓ కుర్రాడు తన బైక్ నెంబర్ ప్లేట్‌ను (Number Plate) అద్భుతంగా డిజైన్ చేశాడు. అది నెంబర్‌ను మాత్రమే కాకుండా.. ఇండికేటర్‌గా కూడా పని చేస్తోంది.

బైక్‌పై వెళ్తున్నప్పుడు ఎడమ వైపు తిరగాలన్నా, కుడి వైపు తిరగాలన్నా లైట్లతో ఇండికేటర్ సిగ్నల్ ఇస్తుంటారు. అయితే ఆ కుర్రాడు తన నెంబర్ ప్లైట్‌పై ``లెఫ్ట్ సైడ్``, ``రైట్ సైడ్`` అని అక్షరాలు వచ్చేలా డిజైన్ చేశాడు. బైక్ హ్యాండిల్‌కు ఉన్న స్విచ్ నొక్కితే నెంబర్ ప్లేట్ మారుతోంది. ఆ కుర్రాడి తెలివితేటలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఆ కుర్రాడి తెలివితేటలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video: మనం రోజూ ఉపయోగించే కత్తెర తయారీ వెనుక ఇంత శ్రమ ఉందా? వైరల్ వీడియో చూడండి..

``ఇది నెక్ట్స్ జనరేషన్ ఇంజినీరింగ్``, ``భారతదేశంలో ట్యాలెంట్‌కు కొదవ లేదు``, ``ఈ టెక్నాలజీ భారత్ నుంచి బయటకు వెళ్లకూడదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 11 వేల మందికి పైగా లైక్ చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 05:44 PM