Share News

Viral Video: తండ్రిని ఆరేళ్ల కొడుకు ఎలా కాపాడాడో చూడండి.. కుర్రాడి తెలివిపై నెటిజన్ల ప్రశంసలు!

ABN , Publish Date - Mar 18 , 2024 | 05:00 PM

ఓ ఆరేళ్ల కుర్రాడు చాలా కామ్‌గా, తెలివిగా వ్యవహరించిన తన తండ్రిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ వీడియోను చిత్రీకరించారు.

Viral Video: తండ్రిని ఆరేళ్ల కొడుకు ఎలా కాపాడాడో చూడండి.. కుర్రాడి తెలివిపై నెటిజన్ల ప్రశంసలు!

ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న పిల్లలు చాలా భయపడతారు. గట్టిగా కేకలు వేసి ఏడుపు అందుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని కుర్రాడు (Boy) చాలా కామ్‌గా, తెలివిగా వ్యవహరించిన తన తండ్రిని (Father) పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. చైనాలో (China) ఈ వీడియోను చిత్రీకరించారు. sachkadwahai అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి నిచ్చెన (Ladder) పై నుంచి కిందకు దిగుతున్నాడు. కింద ఆరేళ్ల కుర్రాడు ఆ నిచ్చెనను పట్టుకున్నాడు. హఠాత్తుగా ఆ నిచ్చెన మధ్యలోకి విరిగిపోయింది. కింద ఉన్న కుర్రాడు భయపడకుండా ఆ నిచ్చెనను తన శక్తి కొలదీ పట్టుకున్నాడు. ఆ తండ్రి చాలా నెమ్మదిగా పై నుంచి కిందకు సురక్షితంగా దిగాడు. పక్కింట్లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

ఆ వీడియోకు లక్షల్లో వ్యూస్ లభించాయి. ఆరేళ్ల వయసు అయినా కూడా చాలా సహనంగా వ్యవహరించిన కుర్రాడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఆ కుర్రాడు తన తండ్రికి నైతిక మద్దతు అందించాడు``, ``ఆ కుర్రాడు సమయానికి తగినట్టు చక్కగా స్పందించాడు``, ``తండ్రి చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 05:00 PM