Share News

AP Politics: వైసీపీకి ఊహించని షాక్.. ఎంపీ బాలశౌరి రాజీనామా

ABN , Publish Date - Jan 13 , 2024 | 06:18 PM

YSRCP Resigns: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగులు వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లో రాజీనామా చేయగా.. మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.

AP Politics: వైసీపీకి ఊహించని షాక్.. ఎంపీ బాలశౌరి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగులు వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లో రాజీనామా చేయగా.. మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.


ఏం జరిగిందో..?

తాజాగా.. ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈయన అత్యంత ఆప్తుడు. సడన్‌గా ఎంపీ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. అయితే.. బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. మచిలీపట్నం నుంచి ఎంపీగా పేర్ని నానిని బరిలోకి దింపాలని.. బాలశౌరికి పొమ్మనలేక హైకమాండ్ పొగబెట్టిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా.. పేర్ని నానికి-బాలశౌరికి గత కొన్నిరోజులు అస్సలు పడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టును మచిలీపట్నం నుంచి బరిలోకి దింపుతున్నారు. ఇందుకే నానిని ఎంపీగా పోటీచేయించాలన్నది వైసీపీ ప్లానట. ఈ క్రమంలోనే ఇలా బాలశౌరి రాజీనామా చేశారని సమాచారం.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2024 | 06:21 PM