Share News

RK Big Debate With Revanth : సాయంత్రం 7గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:49 AM

RK Big Debate With CM Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక మొదటిసారి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’కి (ABN-Andhrajyothy) విచ్చేస్తున్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. (ABN MD Radhakrishna) రేవంత్‌తో బిగ్ డిబేట్ (RK Big Debate) చేయబోతున్నారు. ఈ డిబేట్ ఇవాళ సాయంత్రం 6గంటలకు ఏబీఎన్‌లో లైవ్‌లో జరగనుంది.

RK Big Debate With Revanth : సాయంత్రం 7గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

అవును.. తెలంగాణ ప్రజానీకం అనుకున్నది, ఎగ్జిట్ పోల్స్ చెప్పింది అక్షరాలా నిజమై కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చేసింది. ఇక రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లే జనం మెచ్చిన జనం నేత.. రేవంత్ రెడ్డే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ‘ ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..’ (Revanth Reddy) అంటూ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదిక నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే కొట్లాటలకు మారుపేరన్నది జగమెరిగిన సత్యమే. అయితే.. తెలంగాణలోనూ సీఎం సీటు కోసం చిన్నపాటి యుద్ధమే జరిగింది కానీ.. అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపింది.. అదే విధంగా కీలక, ముఖ్య నేతలందరినీ కేబినెట్‌లోకి తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులు కావొస్తోంది. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజాపాలన సవ్యంగా సాగుతోందని.. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వబోమని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలెంత అనేది సీఎం రేవంత్ మాటల్లోనే తెలుసుకుందాం రండి.


సీఎం అయ్యాక ఫస్ట్.. ఫస్ట్..!

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక మొదటిసారి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’కి (ABN-Andhrajyothy) విచ్చేస్తున్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. (ABN MD Radhakrishna) రేవంత్‌తో బిగ్ డిబేట్ (RK Big Debate) చేయబోతున్నారు. ఈ డిబేట్ ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఏబీఎన్‌లో లైవ్‌లో జరగనుంది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటర్వ్యూ కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ చానెల్స్ భారీగానే పోటీపడ్డాయి. అయితే ఎన్నికలకు ముందు ఏబీఎన్‌ బిగ్ డిబేట్‌లో పాల్గొని.. ఒకటికి పదిసార్లు కాంగ్రెస్ గెలుస్తోంది అని రేవంత్ బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. పార్టీ గెలిచిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ ఆర్కే గారికే బిగ్‌డిబేట్‌గా ఇస్తానని మరీ చెప్పారు. దీంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏబీఎన్‌కు విచ్చేస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు.. 7 గంటలకు రెడీ అయిపోండి.


రండి.. చూడండి..!

అసలు కాంగ్రెస్‌కు గెలుపునకు దోహదపడిందేంటి..? రేవంత్ రెడ్డినే సీఎంగా ఎందుకు హైకమాండ్ ఎందుకు చేసింది..? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయ యాత్ర ఎలా సాగింది..?. ప్రజల మద్దతు సాధించడంలో కాంగ్రెస్ ఎలా సక్సెస్ అయ్యింది?. కేసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు రేవంత్ రెడ్డిని ఎందుకు భావించారు?. రేవంత్ నేతృత్వంలో నెలరోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోందా?. ప్రజలకు హామీ ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేయగలరా?. తెలంగాణ అప్పుల్లో ఉందంటున్న రేవంత్ సర్కార్ ఎలా నెట్టుకొస్తుంది?. పార్టీలో ప్రభుత్వంలో సీనియర్ నాయకులు రేవంత్‌కు సహకరిస్తున్నారా?. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారుతో సంబంధాలపై రేవంత్ వ్యూహమేంటి?. కాంగ్రెస్ పాలనపై తొలిరోజు నుంచే దాడి మొదలుపెట్టిన బీఆర్ఎస్‌కు రేవంత్ కౌంటర్ ఏంటి?. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సంగతేంటో చూసేందుకు రేవంత్ సిద్ధమయ్యారా?. కేసీఆర్ కుటుంబం అవినీతిని కక్కిస్తానన్న రేవంత్ దర్యాప్తు జరిపిస్తారా?.. ఇలా ఒకటా రెండా.. పదుల సంఖ్యలో ప్రశ్నలకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా నిర్వహించబోయే బిగ్ డిబేట్‌‌లో సమాధానాలు తెలుసుకుందాం రండి.

Updated Date - Jan 06 , 2024 | 12:13 PM