Cooking Hacks: కూరల్లో పులుపు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..!

ABN, Publish Date - Jul 30 , 2024 | 12:10 PM

పాకశాస్త్రం ఓ గొప్ప కళ. అన్ని రుచులు సమపాళ్లలో ఉండేలా వండటం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. వంట నేర్చుకునే దశలో ఉన్నవారు కూరల్లో ఉప్పు, కారం, పులుపు ఇలా ఏదో ఒకటి ఎక్కువ, తక్కువ చేస్తుంటారు. ఇవన్నీ తక్కువైనా వాటికి తిరిగి కలపడం ద్వారా రుచిని సమం చేయవచ్చు. కానీ ఎక్కువైనప్పుడే సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా పులుపు రుచి ఎక్కువైనప్పుడు దాన్ని తినాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే.. అలా కాకుండా కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దాని రుచిని సమం చేయవచ్చు.

Cooking Hacks: కూరల్లో పులుపు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..! 1/5

కూరను పలచన చేయవచ్చు.. కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు అందులో కొద్దిగా నీరు లేదా కూరగాయలు ఉడికించిన నీటిని కలిపి కొద్దిసేపు ఉడికించాలి. ఇది పులుపును సమం చేయడంలో సహాయపడుతుంది.

Cooking Hacks: కూరల్లో పులుపు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..! 2/5

పంచదార.. వంటల్లో కొందరు బెల్లం లేదా పంచదార వాడుతుంటారు. పులుపు ఎక్కువైనప్పుడు కూరలో కాస్త బెల్లం లేదా పంచదార కలిపితే పులుపు అడ్జెస్ట్ అవుతుంది.

Cooking Hacks: కూరల్లో పులుపు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..! 3/5

బేకింగ్ సోడా.. కూరలలో అదనపు పులుపు తొలగించడానికి బేకింగ్ సోడా బాగా సహాయపడుతుందట. ఇది ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది. పులుపు తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

Cooking Hacks: కూరల్లో పులుపు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..! 4/5

క్రీమ్... కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు క్రీమ్ లేదా పాలమీగట ను బాగా గిలక్కొట్టి కలపాలి. క్రీమ్ లో కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది పులుపును కంట్రోల్ చేస్తుంది.

Cooking Hacks: కూరల్లో పులుపు ఎక్కువైతే కంగారు పడక్కర్లేదు.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..! 5/5

కూరగాయలు.. కూరల్లో పులుపు సమం చేయడానికి బంగాళదుంప, క్యారెట్ వంటి కూరగాయలను ఉడికించి కూరల్లో కలపాలి. ఇవి పులుపును గ్రహిస్తాయి. తద్వారా కూర రుచిని సమం చేస్తాయి.

Updated at - Jul 30 , 2024 | 12:24 PM