Constipation: ఈ 4 ఆసనాలు వేశారంటే చాలు.. మలబద్దకం సమస్య మాయం..!

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:18 PM

చాలామంది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే సమస్యలలో మలబద్దకం ప్రధానమైనది. ప్రేగు కదలికలు తక్కువగా ఉన్నప్పుడు మలం బయటకు వెళ్లడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే మలబద్దకం ఏర్పడుతుంది. ఆహారంలో ద్రవ పదార్థాలు, ఫైబర్ ఆహారాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి లేకపోవడం వల్ల మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అయితే యోగ ఆసనాలతో మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.

Constipation: ఈ 4 ఆసనాలు వేశారంటే చాలు.. మలబద్దకం సమస్య మాయం..! 1/4

తాడాసనం.. పాదాలపై నిలబడి బ్యాలెన్స్ గా ఉండాలి. పాదాలను కాస్త ఎడంగా ఉంచాలి. చేతులను పైకి ఎత్తి అరచేతులను ఒకదానికొకటి ఆనించాలి. చేతి వేళ్లను ఇంటర్ లాక్ చేయాలి. దృష్టిని ఎదురుగా ఉంచాలి. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

Constipation: ఈ 4 ఆసనాలు వేశారంటే చాలు.. మలబద్దకం సమస్య మాయం..! 2/4

వజ్రాసనం.. వజ్రాసనం వేయడానికి మోకాళ్ల మీద కూర్చోవాలి. పిరుదులు పాదాలమీద, తొడలు మోకాలి కింద భాగం పైన ఉండేలా చూసుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. రెండు అరచేతులను మోకాళ్ల మీద ఉంచాలి. తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి ఆ ఆసనం బాగా సహాయపడుతుంది.

Constipation: ఈ 4 ఆసనాలు వేశారంటే చాలు.. మలబద్దకం సమస్య మాయం..! 3/4

భుజంగాసనం.. భుజంగాసనం వేయడానికి బోర్లా పడుకోవాలి. అరచేతులు నేలకు అనించి బలంగా నేలను ఒత్తుతూ మెల్లిగా తల, ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. ఇది పడగ విప్పిన పాము ఆకారంలో ఉండటం వల్ల దీనికి భుజంగాసనం అని పేరు.

Constipation: ఈ 4 ఆసనాలు వేశారంటే చాలు.. మలబద్దకం సమస్య మాయం..! 4/4

ఉద్రాకర్షణ ఆసనం.. మోకాళ్లను వంచి వజ్రాసన భంగిమలో కూర్చోవాలి. రెండు చేతులను మోకాళ్ల పై ఉంచాలి. లోతుగా శ్వాస తీసుకునేటప్పుడు ఎడమ మోకాలిని మెల్లిగా పైకి లేపాలి. తలను కూడా ఎడమవైపుకు వీలైనంతగా తిప్పాలి. తిరిగి శ్వాస వదులుతున్నప్పుడు మోకాలిని కిందకు వంచుతూ కుడి కాలిని పైకి లేపాలి. కుడివైపు తలను వీలైనంతగా తిప్పాలి. ఇలా చేస్తే మలబద్దకం తగ్గుతుంది.

Updated at - Jul 31 , 2024 | 01:18 PM