భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం..

ABN, Publish Date - Apr 18 , 2024 | 08:58 AM

భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కల్యాణ వేదికపై వధూవరులుగా జానకిరాములు ఆసీనులయ్యారు. వరుడి తండ్రి దశరథ మహారాజు తరఫున ఒకటి, వధువు తండ్రి జనక మహారాజు తరఫున ఇంకోటి.. భక్తుల తరఫున మరొకటి.. ఇలా రామదాసు చేయించిన ‘‘మూడు సూత్రాల మంగళసూత్రం’’ వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతమ్మవారి మెడలో పడింది. అణిముత్యములు తలంబ్రాలయ్యాయి. ఆ తలంబ్రాలు నీలమేఘశ్యాముడైన రాముడు తన దోసిట తీసుకోగానే నీలపురాశిగా మిలమిలలాడాయి! సీతమ్మ దోసిట్లోకి చేరగానే కెంపులై మెరిశాయి! జానకిరాముల శిరమున వెలసిన ఆ తలబంబ్రాలదెంత భాగ్యం.. ఆ జగత్కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తకోటిదెంత పుణ్యం! ఆ భక్తి భావన మనసునిండా ఉప్పొంగగా భక్తజనమంతా అంతా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. 1/6

భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వరుడి తండ్రి దశరథ మహారాజు తరఫున ఒకటి, వధువు తండ్రి జనక మహారాజు తరఫున ఇంకోటి.. భక్తుల తరఫున మరొకటి.. ఇలా రామదాసు చేయించిన మూడు సూత్రాల నమూనాలు..

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. 2/6

భద్రాద్రి శ్రీ సీతారాములవారికి వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపిస్తున్న దృశ్యం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. 3/6

భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మంగళసూత్రాన్ని భక్తులకు చూపుతున్న దృశ్యం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. 4/6

రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువస్తున్న దృశ్యం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. 5/6

భద్రాద్రి శ్రీ సీతారాములవారికి వేద పండితులు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరిస్తున్న దృశ్యం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. 6/6

కల్యాణమూర్తులను పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఊరేగింపుగా మిథా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకువస్తున్న దృశ్యం.

Updated at - Apr 18 , 2024 | 08:58 AM