ఎన్‌సీసీ వారోత్సవాలు.. కరీంనగర్‌లో సేవా కార్యక్రమం
ABN, Publish Date - Nov 24 , 2024 | 05:05 PM
దేశవ్యాప్తంగా ఎన్‌సీసీ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకుని కరీంనగర్‌లో కార్ఖానాగడ్డలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులోభాగంగా ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని వారు సందర్శించారు. ఆ క్రమంలో వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, అంధులకు పళ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ANO ఫస్ట్ ఆఫీసర్ కె. త్రివేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కె. త్రివేణి మాట్లాడుతూ.. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విద్యార్థుల్లో దయా, ప్రేమ, కరుణా, సేవా భావం అలవడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ అధికారి రాధిక, పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు.
1/11
దేశవ్యాప్తంగా ఎన్‌సీసీ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకుని కరీంనగర్‌లో కార్ఖానాగడ్డలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
2/11
అంధులకు పండ్లు పంపిణి చేస్తున్న ఎన్‌సీసీ అధికారి కె. త్రివేణితోపాటు విద్యార్థులు
3/11
వృద్ధులకు పండ్లు పంపిణి చేస్తున్న ఎన్‌సీసీ అధికారి కె. త్రివేణితోపాటు విద్యార్థులు
4/11
అంధుడికి పండ్లు పంచి పెడుతున్న ఎన్‌సీసీ కేడెట్లు
5/11
అంధుడికి పండ్లు పంచి పెడుతున్న ఎన్‌సీసీ కేడెట్లు
6/11
వికలాంగుడికి పండ్లు పంచి పెడుతున్న ఎన్‌సీసీ కేడెట్లు
7/11
వృద్ధాశ్రమంలో వృద్ధురాలితో ఎన్‌సీసీ అధికారి కె. త్రివేణితోపాటు ఎన్‌సీసీ కేడెట్లు
8/11
వికలాంగుడికి పండ్లు అందిస్తున్న ఎన్‌సీసీ కేడెట్లు
9/11
వృద్ధుడికి పండ్లు పంచి పెడుతున్న ఎన్‌సీసీ కేడెట్లు
10/11
వృద్ధులకు పండ్లు పంచి పెడుతున్న ఎన్‌సీసీ కేడెట్లు
11/11
వృద్ధాశ్రమంలో వృద్ధురాలికి పండ్లు ఇస్తున్న ఎన్‌సీసీ కేడిట్
Updated at - Nov 24 , 2024 | 05:10 PM