Holi: తెలంగాణలో హోలీ సంబరాలు

ABN, Publish Date - Mar 26 , 2024 | 07:55 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఎక్కడా చూసిన రంగులే కనిపించాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని కెమికల్ రంగులతో ఆడకుండా సేంద్రీయ రంగులతో హోలీని సెలెబ్రేట్ చేసుకున్నారు. హైద్రాబాద్‌లో అయితే సోమవారం తెల్లవారుజామున నుంచే హోలీ సంబరాలు మొదలయ్యాయి. యువతీ, యువకులు ఆటపాటలతో రంగుల హరివిల్లులో స్నేహితులతో, కుటుంబాలతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుని సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 1/7

హైదరాబాద్‌లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా యువతీ యువకులు రంగులు చల్లుకున్నారు. చిన్నారుల కేరింతలతో వీధులు సందడిగా మారాయి.

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 2/7

చిన్నా, పెద్దా తేడా లేకుండా యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ.. చిన్నారుల కేరింతలతో హోలీ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 3/7

వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో కేరింతలు కొడుతూ.. ఆటపాటలతో డాన్సులు చేస్తూ హోలీ సంబరాలు జరుపుకుంటున్న యువతీ. యువకులు. చిన్నారులు..

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 4/7

భూపాలపల్లిలో చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా హోలీ జరుపుకుంటున్న దృశ్యం.

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 5/7

రంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో కేరింతలు కొడుతూ.. ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ హోలీ జరుపుకుంటున్న యువతీ యువకులు చిన్నారులు...

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 6/7

హనుమకొండ ఎన్ఐటీడబ్ల్యూలో హోలీ సంబరాలు హోలీ సంబరాలు జరుపుకుంటున్న యువతీ యువకులు..

Holi: తెలంగాణలో హోలీ సంబరాలు 7/7

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యువతులు, చిన్నారులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

Updated at - Mar 26 , 2024 | 07:55 AM