అలర్ట్.. అక్టోబర్ 1 నుంచీ ఈ 6 రూల్స్‌లో మార్పు!
ABN, Publish Date - Sep 30 , 2024 | 11:22 AM
ఆధార్ కార్డు మొదలు చిన్న మొత్తాల పథకం వరకూ అక్టోబర్ 1 నుంచి రూల్స్‌లో స్వల్ప మార్పులు అమల్లోకి రానున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి
1/7
అక్టోబర్ 1 నుంచి పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని అనుమతించరు.
2/7
తాత లేదా బామ్మ సుకన్య సమృద్ధి పథకం కింద తెరిచిన ఖాతాను బాలిక తల్లిదండ్రులు లేదా గార్డియన్ పేరిట మారుస్తారు
3/7
హెచ్‌డీఎఫ్‌సీ లాయల్టీ పథకంలో మార్పుల ప్రకారం, అక్టోబర్ 1 నుంచి స్మార్ట్‌బయ్ ప్లాట్‌ఫామ్‌పై కొనుగోళ్లకు సంబంధించి ఒక్కో త్రైమాసికంలో ఒక యాపిల్ ఉత్పత్తికి మాత్రమే రివార్డ్ పాయింట్లు రీడీమ్ చేసుకోవచ్చు.
4/7
మైనర్ పీపీఎఫ్ అకౌంట్ల వడ్డీ రేట్లు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంకు రేట్లకు అనుగూణంగా ఉంటాయి. మేజర్లయ్యాక సాధారణ పీపీఎఫ్ రేట్లు వర్తిస్తాయి.
5/7
పలు పీపీఎఫ్ అకౌంట్లు ఉన్నట్టైతే ప్రధాన అకౌంట్‌కే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. మిగతా వాటిల్ని ప్రధాన అకౌంట్లలో విలీనం చేస్తారు.
6/7
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రతి నెలా మార్పులు చేస్తాయి కాబట్టి అక్టోబర్ 1 తరువాత మారే ఛాన్స్ ఉంది
7/7
విమాన ఇంధనాల ధరలు కూడా అక్టోబర్ 1 తరువాత మారే అవకాశం ఉంది.
Updated at - Sep 30 , 2024 | 11:26 AM