ఈ ఫొటోలు చూస్తే మీ మనసు కరగడం పక్కా.. మోదీ ఇంటికి విశిష్ట అతిథి
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:05 PM
ప్రధాని మోదీ ఇంట ఓ లేగదూడ జన్మించింది. ఆ అతిథిని ప్రేమగా ఆహ్వానించిన మోదీ.. శాలువా కప్పి, ప్రత్యేక పూజలు చేశారు.
1/8
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ ఇంట ఓ లేగదూడ జన్మించింది. ఆ అతిథిని ప్రేమగా ఆహ్వానించిన మోదీ.. శాలువా కప్పి, ప్రత్యేక పూజలు చేశారు.
2/8
ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఉంటున్న ఆవు.. లేగదూడకు జన్మనిచ్చింది.
3/8
మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టిన దూడకు మోదీ స్వాగతం పలికారు. దాన్ని దగ్గరికి తీసుకుని శాలువా కప్పి సన్మానించారు.
4/8
దేవీ విగ్రహం ఎదరుగా కూర్చున్న మోదీ.. దూడను పక్కనే పెట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5/8
అనంతరం తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా నిమిరుతూ ముద్దు పెట్టారు. అంతేకాకుండా ఇంటి బయట గార్డెన్‌లో దూడతో చాలా సేపు ఆడుకున్నారు.
6/8
నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దానికి 'దీప్ జ్యోతి' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.
7/8
ఆ రేఖ కాంతికి చిహ్నమని అందుకే ఆ పేరు పెట్టినన్నారు. తన ఇంట కొత్త అతిథి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
8/8
సదరు వీడియోను మోదీ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Updated at - Sep 14 , 2024 | 04:05 PM