Sri Ram Navami: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు.. పారవశ్యంలో భక్తులు..
ABN, Publish Date - Apr 17 , 2024 | 04:54 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ్ని సీతారామలక్ష్మణ ఆంజనేయులను దర్శించుకున్నారు.
1/7
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ్ని సీతారామలక్ష్మణ ఆంజనేయులను దర్శించుకున్నారు.
2/7
దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రాకను ముందుగానే అంచనా వేసిన అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
3/7
భూపాలపల్లి జిల్లాలో రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. హనుమాన్ దేవాలయంలో జరిగిన వేడుకల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
4/7
వరంగల్ సంగెం మండలం చింతలపల్లిలో పురోహితులు సముద్రాల సుదర్శనాచార్యులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు.
5/7
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
6/7
ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సీతారాముల కల్యాణ ఘడియల సమయంలో జై శ్రీరామ్ నినాదంతో భక్తి పారవశ్వంలో మునిగిపోయారు.
7/7
కరీంగర్ జిల్లా వ్యాప్తంగా రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడు కొలువైన తర్వాత మొదటి శ్రీరామనవమి పర్వదినం కావడంతో భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు.
Updated at - Apr 17 , 2024 | 05:00 PM