Fire Accident: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN, Publish Date - Aug 04 , 2024 | 12:57 PM
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి.
1/7
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి.
2/7
ఆదివారం ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు.. కాసేపట్లో విశాఖపట్నం నుంచి తిరుమల బయల్దేరాల్సి ఉండగా నాలుగో నంబర్ ఫ్లాట్ పారం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
3/7
ఈ మంటల్లో బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ మూడూ ఏసీ బోగీలే.
4/7
రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే, ఫైర్ సిబ్బంది రంగంలోకి మంటలు ఆర్పారు.
5/7
రైల్వేస్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని అధికారులు బయటికి పంపారు.
6/7
ఏసీ బోగీల్లో మంటలు రేగినట్లు, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
7/7
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేదు. రైల్లో మంటల వ్యాప్తిపై అన్ని కోణాల్లోనూ అధికార యంత్రాంగం దర్యాప్తు మొదలుపెట్టింది.
Updated at - Aug 04 , 2024 | 01:01 PM