తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

ABN, Publish Date - Mar 08 , 2024 | 01:00 PM

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో  వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. 1/6

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచి ఆలయాలకు పోటెత్తారు.

తెలుగు రాష్ట్రాల్లో  వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. 2/6

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిన అధికారులు. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న టెంపుల్..

తెలుగు రాష్ట్రాల్లో  వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. 3/6

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యుత్ వెలుగులతో ముస్తాబైన వరంగల్ వేయిస్థంభాల దేవాలయం

తెలుగు రాష్ట్రాల్లో  వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. 4/6

షాద్‌నగర్ సమీపంలో రామేశ్వరం శివ దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించిన దృశ్యం.

తెలుగు రాష్ట్రాల్లో  వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. 5/6

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా శివగంగ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన దృశ్యం..

తెలుగు రాష్ట్రాల్లో  వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. 6/6

నల్గొండ పట్టణం పానగల్లులో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో విరాజిల్లుతున్న ఛాయా, పచ్చల సోమేశ్వరాలయం..

Updated at - Mar 08 , 2024 | 04:35 PM