Share News

NRI: ముగిసిన ఎన్నికలు.. దుబాయికి పెరిగిన తెలంగాణ నాయకుల రాక

ABN , Publish Date - May 26 , 2024 | 04:19 PM

తెలంగాణలో శాసన సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం చేసిన అనంతరం ఫలితాలు వచ్చే వరకు విదేశీ పర్యటనలకు వస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతుంది.

NRI: ముగిసిన ఎన్నికలు.. దుబాయికి పెరిగిన తెలంగాణ నాయకుల రాక

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నిత్యం ప్రజాక్షేత్రంలో నిమగ్నమై ఉండే నాయకగణం తీరిక చేసుకొని విదేశీ పర్యటనలకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి వారికి వారి వారి ప్రాంతాల ప్రవాసీయులు (NRI) విదేశీగడ్డపై స్వాగతం పలుకడం సాధారణం. అందునా హోరాహోరిగా జరిగిన తెలంగాణలో శాసన సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం చేసిన అనంతరం ఫలితాలు వచ్చే వరకు విదేశీ పర్యటనలకు వస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతుంది.

NRI: సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కొంత మంది రాజకీయ నాయకులు దుబాయి పర్యటనకు వస్తున్నారు. అందులో కొందరు పూర్తిగా తమ కుటుంబ సభ్యులతో వ్యక్తిగత విహారయాత్రలలో గడుపుతుండగా మరికొందరు యు.ఏ.ఇలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న తమ తమ నియోజకవర్గాలకు చెందిన వారితో మమేకవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ వారం రోజుల దుబాయి పర్యటన జరిగింది. ఈ నియోజకవర్గానికి చెందిన కొన్ని వేలాది మంది ప్రవాసీయులు దుబాయి మరియు ఇతర ఎమిరేట్లలో పని చేస్తుండడంతో సహాజంగా దీని పట్ల ఆసక్తి వ్యక్తమయ్యింది. ఆయన అబుదాబిలో ఒక మృతదేహాం కేసు, దుబాయిలో మరికొన్ని కేసుల గురించి భారతీయ అధికారులతో మాట్లాడడంతో పాటు వివిధ సంఘాలు, ప్రముఖులు ఏర్పాటు చేసిన సమావేశాలు, విందులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయిలోని గల్ఫ్ తెలంగాణ వెల్ఫెర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (జి.టి.డబ్ల్యు.సి.ఎ) ఆది శ్రీనివాస్‌తో సమావేశమై ప్రవాసీయులకు సంబంధించిన వివిధ సమస్యలు, వాటిపై విధానపరమైన ప్రభుత్వ నిర్ణయాల గురించి చర్చించింది.

2.jpg


అనంతరం ఏర్పాటు చేసిన విందులో దుబాయి, షార్జా, ఇతర ఎమిరేట్లలోని ఎంపిక చేసిన కొంత మంది తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. సాధారణంగా ప్రచారానికి దూరంగా ఉండే జి.టి.డబ్ల్యు.సి.ఎ ఒక యు.ఏ.ఇలోనే కాకుండా మొత్తం గల్ఫ్ దేశాలలో ప్రప్రథమంగా ఏర్పాటయిన తెలంగాణ ప్రవాసీయుల సంస్థ. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న కాలంలో దుబాయిలో ఇది ఏర్పాటయింది. దీనికి అధ్యక్షుడిగా జువ్వాడి శ్రీనివాస రావు ఉపాధ్యక్షుడిగా సలాఓద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సామ్యూల్ దామెరలు వ్యవహారిస్తున్నారు. జి.టి.డబ్ల్యు.సి.ఎ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెరాస, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన దుబాయిలోని ముఖ్య నాయకులందరు కూడా హజరయ్యారు. పార్టీలకు అతీతంగా తమ సంస్థ ప్రవాసీయుల గురించి పని చేస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణలో కె.చంద్రశేఖర్ రావు హయాంలో కూడా తాము వివిధ సంక్లిష్ట సమస్యలపై పని చేశామని శ్రీనివాస రావు, సలాఓద్దీన్, సామ్యూల్‌లు గుర్తు చేశారు.

అంతకు ముందు ఆది శ్రీనివాస్ షార్జా, దుబాయిలలోని కొందరు భారతీయ అధికార ప్రముఖులను కూడా కలుసుకొన్నారు. నియోజకవర్గానికి చెందిన అనేక మంది తమ శాసనసభ్యుడిని ప్రవాసంలో కలుసుకోవడం సంతోషకరమని ప్రవాసీ ప్రముఖుడు, వ్యాపారి కటుకం రవి పేర్కొన్నారు.

కాంగ్రేస్ నాయకుడు, ఎమ్మెల్సీ బి.మహెశ్ కుమార్ గౌడ్ కూడా దుబాయి పర్యటనకు వచ్చి వెళ్ళారు. అదే విధంగా మరో కాంగ్రెస్ శాసన సభ్యుడు మకాన్ సింగ్ ఠాకూర్ కూడా ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్నారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నాయకుల పర్యటనలు దుబాయికి పెరిగాయని యు.ఎ.ఇ తెలంగాణ ప

పీసీసీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు యస్వీ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ శాసన సభ్యులు గంగుల కమాలకర్‌తో పాటు మరికొంత మంది నాయకులు కూడా వేర్వేరుగా దుబాయి పర్యటనకు వచ్చి వెళ్లారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - May 26 , 2024 | 04:21 PM