Share News

NRI: బే ఏరియాలో ‘తెలుగుదేశం-జనసేన-బీజేపీ’ ఎన్నారైల సమావేశం!

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:41 PM

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైనటువంటి ఎన్నారైలు ఆదివారం సాయంత్రం.. మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన సమావేశం నిర్వహించారు.

NRI: బే ఏరియాలో ‘తెలుగుదేశం-జనసేన-బీజేపీ’ ఎన్నారైల సమావేశం!

ఎన్నారై డెస్క్: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలురైనటువంటి ఎన్నారైలు (NRI) ఆదివారం సాయంత్రం.. మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వందమందికి పైగా ప్రముఖులు పాల్గొని కీలక చర్చలు జరిపారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకుని రావాల్సిన ఆవశ్యకత గురించి చర్చించారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అరాచక పాలన మీద పలువురు ఎన్నారైలు ఆందోళన వ్యక్తం చేసారు. 2014లో మాదిరి కూటమి‌ బంపర్ మెజారిటీ సాధించడం ఖాయం అంటూ కొంతమంది ఎన్నారైలు తమ అభిప్రాయాలు తెలిపారు.

3.jpgకొంత మంది ప్రముఖులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య ప్రజల సెన్సిటివ్ డేటాను వాలంటీర్ల ద్వారా సేకరించి ఆ డేటాని తప్పుదారి పట్టించేలా చెస్తున్నారని ఆరోపించారు. ఎదురుతిరిగి మాట్లాడితే నియంతలా మారి అధికారబలంతో వేధిస్తున్నారు అన్నారని అన్నారు. ఇటువంటి పాలనను ఇంటికి పంపించకపోతే మనం సొంత రాష్ట్రానికి  కూడా వెళ్లలేని పరిస్తితులు తీసుకొస్తాడీ నియంత జగన్ అంటూ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయిందని, ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే మనం పూర్తిగా ఆంధ్రప్రదే‌శ్‌ని మర్చిపోవచ్చంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి తాము ఇంకా బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని, తమ వంతు ఆర్థిక సహాయాన్ని జనసేన తెలుగుదేశం కూటమికి అందించడంతోపాటు గ్రౌండ్‌లో కూటమి అభ్యర్థులకి ప్రచారం చేయాలి అని అన్నారు. ఇందుకు కావలసిన ఆర్థికమైన నిధులు తామే సమకూర్చుకుందామని తీర్మానించుకున్నట్టు పలువురు ఎన్నారైలు తెలియజేసారు.

1.jpg


ఈ సమావేశంలో తణుకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ జూమ్ కాల్‌లో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. జనసేన నాయకులు బొలిశెట్టి సత్య మాట్లాడుతూ, జన సైనికులు నిరాశకి ఎక్కడా తావివ్వకుండా పొత్తు ధర్మం పాటించి 175 నియోజకవర్గాల్లో‌ బయటకి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేసి అఖండ మెజారిటీ దిశగా పని చేయాలని పిలుపు ఇవ్వగా ఒక్కసారిగా ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగింది.

2.jpgఈ సమావేశంలో తెలుగుదేశానికి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త బల్ల, శ్రీనివాస్ దేవల్ల, ఎంవీ రావు, నరహరి మర్నేని, హరి బాబు బొప్పుడి, సందీప్ ఇంటూరి, సత్య పోలవరపు, జనసేనకు చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటి, తెలుగుదేశం-జనసేన- బీజేపీ పార్టీల అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 03:41 PM