Share News

NRI: ఎడారి నాట పల్నాడు పౌరుషం.. టీడీపీ విజయోత్సవ సంబరాలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:42 PM

మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయోత్సవ సభలను అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలలో పార్టీ అభిమానులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.

NRI: ఎడారి నాట పల్నాడు పౌరుషం.. టీడీపీ విజయోత్సవ సంబరాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పౌరుషంతో పాటు సంతోషానికి పల్నాడు ప్రతీక. ఆత్మాభిమానంతో కూడిన అధికారం, ఆధిపత్యం కోసం అలనాటి బ్రహ్మనాయుడు కాలం నుండి నేటి బ్రహ్మానందరెడ్డి వరకు ప్రతిదీ చారిత్రాత్మకమే. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలలో మాచర్లలో జరిగిన దౌర్జన్యకాండ తక్కువేమి కాదు. రాష్ట్ర చరిత్రలో సంచలనం సృష్టించిన ఈ ఎన్నికల్లో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా 33 వేల ఆధిక్యతతో విజయం సాధించిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల పోరు మాతృభూమితో పాటు ఖండాంతరాలలోని పల్నాడు ప్రవాసీయులలో (NRI) కూడా ఎనలేని ఆసక్తి కల్గించింది. అనేక మంది విదేశాల నుండి తమ ఉద్యోగాలకు సెలువుపెట్టి మరీ ప్రచారం చేసి వెళ్లారు. ఎన్నికల్లో తమ పల్నాడులో అమాయక జనంపై జరిగిన దౌర్జన్యంపై విదేశాలలోని ప్రవాసీయులు కూడా చలించిపోయారు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేడుకల్లో ప్రత్యేక ఆహ్వనం పొందిన 112 మందిలో అత్యధికులు పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వారే ఉన్నారు.

TDP: ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం! స్కాట్‌లాండ్‌లో ప్రవాసాంధ్రుల సంబరాలు

2.jpg


ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయోత్సవ సభలను అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలలో పార్టీ అభిమానులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో సోమవారం రాత్రి ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు షేఖ్ జానీ బాషా ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలను నిర్వహించగా ఇందులో జనసేన, బీజేపీ కూటమి అభిమానులు కూడా పాల్గొన్నారు. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేటతో పాటు పెనమలూరు, దర్శి, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం అభిమానులకు జానీ బాషా విందు ఇచ్చారు.

1.jpg


దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మాచర్లలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ప్రతి సంవత్సరం చేసుకొనే సంప్రదాయ పండుగలు, పల్నాడు ఉత్సవాల కంటే గొప్పదని జానీ బాషా వ్యాఖ్యానించారు. దౌర్జన్యం, అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ కలిసి చేసిన పోరాటానికి తమ ప్రాంతం చాపకూడు స్ఫూర్తి అని మాచర్లకు చెందిన మరో ప్రవాసీయుడు ఎంపర్ల శ్రీనివాస రెడ్డి అన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన జనసేన వీరసైనికులు కొడవళ్ళి చంద్రశేఖర్, రాజు, జాకీర్ షేఖ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన చెన్నుపాటి రాజశేఖర్, అద్దంకి నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ వీరాభిమాని చెన్నుపాటి నరేశ్, ఇస్మాయిల్ షేఖ్‌ల సంతోషం ఈ సందర్భంగా వర్ణనాతీతం. చీరాలకు చెందిన గడ్డం శిల్ప వద్ద సమయానికి పసుపుపచ్చ చీర లేకపోవడంతో తెలుగుదేశం టీ షర్టు ధరించి సంబరాలలో పాల్గొన్నారు.

4.jpgతెలుగుదేశం పార్టీ ఘన విజయం ఎక్కడో ఎడారి దేశాలలోని తెలుగు ప్రజలను సైతం ఆనందమయ సంబరాలలో ముంచిందని సూర్య, ముజ్జమ్మిల్ అన్నారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ అభిమానులతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీల అభిమానులు కూడా సంబరాలలో పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 08:34 PM