Share News

TDP: ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం! స్కాట్‌లాండ్‌లో ప్రవాసాంధ్రుల సంబరాలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 06:38 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం పట్ల ప్రవాసాంధ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వేడుక చేసుకున్నారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరంలోని అప్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో NRIలు సకుటుంబ సమేతంగా పాల్గొని తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

TDP: ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం! స్కాట్‌లాండ్‌లో ప్రవాసాంధ్రుల సంబరాలు

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం పట్ల ప్రవాసాంధ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వేడుక చేసుకున్నారు. స్కాట్‌లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరంలోని అప్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్నారైలు (NRI) సకుటుంబ సమేతంగా పాల్గొని తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. కార్యక్రమం ప్రారంభంలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపై తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుకు, ఈనాడు అధినేత రామోజీ రావుకు నివాళులు అర్పించారు. అనంతరం బాలబాలికలు కేక్‌లు కట్ చేయగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయాన్ని కొనియాడుతూ సంబరాలు చేసుకున్నారు.

TDP: బెల్జియంలో ఘనంగా కూటమి విజయోత్సవ కార్యక్రమాలు

2.jpg


కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభిమానులైన సాంకేతిక నిపుణులు, వైద్యులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలలో జరిగిన ఆర్థిక, సామాజిక విధ్వంసాన్ని గుర్తు చేసుకున్నారు. 2019కు ముందు శరవేగంగా జరుగుతున్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం ఏవిధంగా కాలరాసిందో గుర్తుచేసుకున్నారు. రాష్ట్రం లో, కేందంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల మద్దతు కీలకం కావటంతో రాబోయే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి పథంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.


కార్యక్రమంలో పొట్లూరు కృష్ణ, గుత్తా అమర్, డాక్టర్ దాసరి శ్రీనివాసరావు, వింజం మురళి, పొత్తూరి నవీన్, మండవ అజయ్, డాక్టర్ లావు శ్రీకాంత్, స్కాట్లాండ్ తెలుగు సంఘం ప్రతినిధి కెంబూరి మైథిలి, పొట్లూరి స్రవంతి, జనసేన, బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 06:40 PM