Share News

NRI-Janasena: జనసేన - కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 15 , 2024 | 08:10 PM

జనసేన - కువైత్ ఆధ్వర్యంలో 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న ఘనంగా జరిగాయి.

NRI-Janasena: జనసేన - కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవం

ఎన్నారై డెస్క్: జనసేన - కువైత్ ఆధ్వర్యంలో 11వ జనసేన (Janasena) ఆవిర్భావ వేడుకలు మార్చి 14న ఘనంగా జరిగాయి. గౌరవ అతిథులుగా సంఘసేవకులు డా. శ్రీధర్, ప్రవాసాంధ్ర తెలుగుదేశం వ్యవస్థాపకులు ములకల సుబ్బారాయుడు, గల్ఫ్ కౌన్సెల్ సభ్యులు వెంకట్ కోడూరి, సురేష్, పత్తి సుబ్బారాయుడు, మురళి రాయల్, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాసేవ నిస్వార్థంగా ఉండాలని నమ్మి ప్రజాసేవకు అంకితం అయిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ అడుగుజాడల్లో నడవాలని, వారికి తన మద్దతు తెలియచేస్తూ వారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కూటమి గెలవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

NRI: బే ఏరియాలో 'తెలుగుదేశం-జనసేన-బీజేపీ' ఎన్నారైల ఆత్మీయ సమావేశం!

ములకల సుబ్బారాయుడు మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కువైత్‌లో ఎవరికి వారు చేసుకొనే వారు అని, వారందరినీ కలుపుకొని ప్రవాసాంధ్ర తెలుగుదేశం అని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేసేవాళ్లమని అన్నారు. ఒక వేదికను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం అంత సులభం కాదని, విభిన్న అభిప్రాయాలు ఉన్న సమూహాన్ని నడపడం కష్టమని అభిప్రాయపడ్డారు. అలాంటిది ఒక పార్టీనీ నడపడం మరింత కష్టమని తెలిపారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన జనసేన అధినేతకు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురు అయ్యాయని వాటిని అన్నిటినీ తట్టుకొని పార్టీనీ నడపడం కష్టమని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను ఒక విశిష్ట నాయకుడిగా కొనియాడారు.

2.jpg


గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజాసేవకు జీవితం అంకితం చేసిన పవన్ కళ్యాణ్‌కు, జనసేన సైనికులకు పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కోట్ల ఆదాయాన్ని వదిలి, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు చుట్టూ కమ్ముకున్న చీకటిలో గుండె నిండా ధైర్యం నింపుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి పవన్ వచ్చారన్నారు. ‘‘మొదట ఎన్నికల్లో రాష్ట్రం కోసం ఎన్నికలు వెళ్లకుండా కూటమికి మద్దతు తెలిపారు. ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి అవసరం అని భావించి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. తక్కువ సీట్‌లు తీసుకున్నారని విమర్శలు చేశారు. మనం సంస్థాగతంగా ఎదగాలి, కింది స్థాయి నుంచి పార్టీనీ బలపరచి రాజకీయంగా ఎదగాలి అనే లక్ష్యం తో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన భవిష్యత్తును చూస్తున్నారు. అధికారంలో భాగస్వామ్యం అయితేనే మనం మన లక్ష్యాలను సాధించగలమని నమ్మారు కాబట్టే, ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి నాయకుడి నిర్ణయాలను, ఆశయాలను గౌరవిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళుతున్న Kuwait jansena నాయకులకు, జనసేన సైనికులుకు 11వ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి గెలిపించాలి’’ అని కోరారు.

3.jpgపలువురు వక్తలు మాట్లాడుతూ.. ‘‘కొన్ని అదృశ్య శక్తులు ఆయనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయి. ఆయన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆత్మవిశ్వాసం సడలలేదు. ప్రజల కోసం మరునాడే రంగంలోకి దిగారు. ఉద్ధానం సమస్యల మీద పోరాడాడు. రైతుల సమస్యల మీద పోరాడుతూ వారికి సొంత డబ్బులతో ఆర్థిక సహాయం చేశారు. ఒక లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేసేటపుడు కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి అని నమ్మి మళ్ళీ కూటమి కట్టడం కోసం పెద్దన్న పాత్ర పోషించి కూటమిని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఆయనను కొందరు విమర్శించారు. వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఆయన పరిపూర్ణంగా ఆలోచించే రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ప్రజల సమస్యల మీద అవగాహన చేసుకున్నవాడు. ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం, ఎవరు స్వార్థం కోసం ఆయనకు సలహాలు, సూచనలు చేస్తున్నారో కనిపెట్టారు. హరి రామ జోగయ్య, ముద్రగడ లాంటి నాయకుల కపట నైజం ఆయనకు అర్థం అయింది. అందుకే ఎక్కడ కూడా పొత్తుకు ఇబ్బందులు కల్గించే వారిని ప్రోత్సహించే పని చేయలేదు’’ అని వ్యాఖ్యానించారు.

4.jpg

ఈ వేడుకల్లో పాల్గొన్న జనశ్రేణులు, తెలుగుదేశం శ్రేణులందరికీ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేనపార్టీ కువైత్ కార్యవర్గం సభ్యులు గంటా రమేష్, గ్రందే ప్రసాద్, బల్లేపల్లి శ్రీనివాస్‌, తోట చంగళ్‌ రాయుడు, కుంచా.శంకర్, మోడెం చిరంజీవి, ధరణి ప్రదీప్, పార్లపల్లె వెంకీ రాయల్, గంగారపు చంద్ర శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 08:20 PM