Share News

NRI: భారతావనిలో ఖర్జూరపు పళ్ళను పండించి గల్ఫ్‌కు ఎగుమతి

ABN , Publish Date - Apr 04 , 2024 | 08:06 PM

భారతావని గడ్డపై పండించిన వీటిని ఖర్జూరపు పళ్ళకు రారాజు దేశంగా పేరొందిన సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడం ద్వారా కృషితో నాస్తి దుర్భిక్షం.. అని నిరూపించారు సంపంగి రమేశ్

NRI: భారతావనిలో ఖర్జూరపు పళ్ళను పండించి గల్ఫ్‌కు ఎగుమతి

  • కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన సంపంగి రమేశ్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా (Saudi Arabia) అంటే విశ్వవ్యాప్తంగా చమురు ఎగుమతులకు పెట్టింది పేరని అందరికి తెలుసు. కానీ తీపి ఖర్జూరపు పళ్ళ ఎగుమతులకు ఈ ఎడారి దేశం ప్రసిద్ధి అనేది కొందరికి మాత్రమే తెలుసు. సౌదీ అరేబియాలో సాగయ్యే ఖర్జూరపు పళ్ళకు హైదరాబాద్‌ సహా ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటుంది. సౌదీ అరేబియా నుండి ఇతర దేశాలకు తిరిగెళ్లే వారందరూ సౌదీ ఖర్జూరపు పళ్ళను ఆసక్తిగా తీసుకెళ్తారు.

ఈ రకమైన ఘనఖ్యాతి ఉన్న సౌదీ అరేబియా దేశానికే భారతదేశం నుండి సాగయ్యే ఖర్జూరపు పళ్ళు కూడా ఎగుమతవుతున్న విషయం మాత్రం బహుశా ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. భారతావని గడ్డపై పండించిన వీటిని ఖర్జూరపు పళ్ళకు రారాజు దేశంగా పేరొందిన సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడం ద్వారా కృషితో నాస్తి దుర్భిక్షం .. అని నిరూపించారు సంపంగి రమేశ్

1.jpgహైదరాబాద్‌కు చెందిన రమేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఎలాంటి రసాయనాలు లేని అసలైన ఆర్గానిక్ కాయగూరల సాగుకు ప్రసిద్ధి చెందిన సంపంగి నాచ్యురల్ బ్రాండు పేర వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే రమేశ్‌కు వినూత్నంగా ఖర్జూరపు సాగు వైపు దృష్టి మళ్ళించారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో 72 ఎకరాలలో గల్ఫ్ దేశాలలో ప్రసిద్ధి గాంచిన బర్ర్హీ అనే ఖర్జూరపు రకాన్ని సాగు చేయడమే కాకుండా దీన్ని సౌదీ అరేబియాకు ఎగుమతి చేస్తున్నారు.

NRI: సౌదీ అరేబియాలో ‘సాటా’ ఇఫ్తార్ విందు


రుచికరమైన, శ్రేష్ఠమైన ఈ ఖర్జూర పళ్ళకు సౌదీ అరేబియాతో పాటు పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం పంటను 350 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నామని, ప్రస్తుతం చెట్ల వయ్ససు రెండు సంవత్సరాలని సంపంగి రమేశ్ వెల్లడించారు. తెలుగునాట కూడా సాగునేల ఖర్జూరపు పళ్ళకు అనువైనప్పటికీ తమిళనాడులోని ధర్మపురి ప్రాంత వాతావరణ సమతౌల్య బర్ర్హీ రకం ఖర్జూరపు పంటకు అనుకూలం కావడంతో అక్కడ దాన్ని సాగు చేస్తున్నట్లుగా చెప్పారు.

4.jpgఒక్క అరబ్బు రారాజు పండు ఖర్జూరానికే సంపంగి పరిమితం కాలేదు. యావత్తు ఫలలోకానికి రాజుగా వర్ణించే మామిడిపై కూడా దృష్టి సారించారు. 60 ఎకరాలలో పండే ఆర్గానిక్ మామిడిని అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేయడానికి ముందుకు కదులుతున్నారు. ప్రస్తుతానికి సింగపూర్ లోని ప్రఖ్యాత వీరా మ్యాంగోస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్లుగా ఆయన చెప్పారు. క్రిమిసంహారక మందులు, రసాయనాల కారణాల వల్ల జీవన, ఆరోగ్య సరళిలో వస్తున్న మార్పుల కారణాన ప్రజలలో ఆహార చైతన్యం పెరిగిందని సంపంగి రమేశ్ చెప్పారు. తాము తొమ్మిది రకాల పప్పుదినుసులను పూర్తిగా ఆర్గానిక్ విధానంలో పండిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.

3.jpg

ఆఫ్రికాలోని ఘానా దేశంలో కూడా ఆర్గానిక్ పంటల సాగు కోసం అక్కడి ప్రభుత్వం ఒక వేయి ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించిందని, తద్వారా తాము యూరోప్ దేశాలలో విస్తరించాలనుకొంటున్నట్లుగా రమేశ్ చెప్పారు. వ్యవసాయ రంగంపై ఉన్న అభిరుచి గుర్తించిన ఘానా విశ్వవిద్యాయలం రమేశ్‌ను గౌరవ డాక్టరే‌ట్‌తో సత్కరించింది.

Updated Date - Apr 04 , 2024 | 10:01 PM