NRI: మంత్రి లోకేష్ చొరవతో స్వదేశం రాక..
ABN , Publish Date - Aug 06 , 2024 | 09:57 PM
ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.
చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజిత్, మరో ప్రతినిధి ముజ్జమ్మిల్ షేక్ సాయంతో మంగళవారం హాసినాను రియాద్ నగరంలో కలిశారు. భారతీయ ఎంబసీ అధికారులకు హసీనాను అప్పగించారు. గత కొన్ని రోజుల నుంచి సరిగ్గా తిండిలేక హసీనా నీరసించిపోయింది. ఆమెకు భోజనం అందజేశారు. ఆ తర్వాత కొంత నగదు కూడా అందించారు. హసీనాను ఎన్ఆర్ఐ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు విజయవాడ ఏపీ ఎన్ఆర్టీ అధికారులకు తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ సమాచారం ఇచ్చారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారుల సాయంతో ఆమె వీసా రద్దు చేసి, స్వదేశానికి పంపించడానికి ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తారని రంజిత్ స్పష్టం చేశారు.