Share News

Cyber Slaves: భారీ స్కామ్.. కాంబోడియాలో చిక్కుకుపోయిన 5 వేల మంది ఎన్నారైలు

ABN , Publish Date - Mar 31 , 2024 | 06:29 PM

విదేశీ బాబ్స్ పేరిట మోసగాళ్లు పన్నిన ఉచ్చు కారణంగా సుమారు 5 వేల మంది భారతీయులు కాంబోడియాలో చిక్కుకుపోయారు.

Cyber Slaves: భారీ స్కామ్..  కాంబోడియాలో చిక్కుకుపోయిన 5 వేల మంది ఎన్నారైలు

ఎన్నారై డెస్క్: విదేశీ బాబ్స్ పేరిట మోసగాళ్లు పన్నిన వలలో పడిన భారతీయులు కాంబోడియాకు (Cambodia) వెళ్లి నానా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 5 వేల మంది భారతీయులు (NRI) ఆ దేశంలో చిక్కుకుని ఉంటారని జాతీయ మీడియా చెబుతోంది. అక్కడి నిందితులు ఎన్నారైలతో బలవంతంగా చట్టవ్యతిరేక సైబర్ నేరాల (Cyber Slaves) చేయిస్తూ స్వేదేశంలోని భారతీయుల నుంచి భారీగా దండుకుంటున్నారట. ఈ స్కామ్ ద్వారా నిందితులకు రూ.500 కోట్ల ఆదాయం వచ్చినట్టు కేంద్రం అంచనా వేస్తోంది. ఇలా చిక్కుకుపోయిన వారిలో కొందరిని కాపాడిన కేంద్రం ఇటీవలే స్వదేశానికి తరలించింది.

NRI: కాంబోడియాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించాం: విదేశాంగ శాఖ


అసలేమిటీ స్కామ్..

కాంబోడియా వేదికగా జరుగుతున్న ఈ స్కామ్‌లో నిందితులు ఉచ్చు పన్ని మరీ భారతీయులను బలవంతంగా దింపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులుగా వారితో నటింపజేస్తూ స్వదేశంలోని భారతీయులను బెదిరించి డబ్బులు వసూలు చేయిస్తున్నారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విదేశాల నుంచి బాధితులు తెప్పించుకునే పార్సిళ్లల్లో అనుమానాస్పదన వస్తువులు ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు నిందితులు దండుకుంటున్నారు. గతేడాది రూర్కేలాకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఆన్‌లైన్ మోసం కారణంగా రూ.67 లక్షలు నష్టపోయానని ఫిర్యాదు చేయడంతో ఓ సైబర్ నేరగాళ్ల బృందం పోలీసులకు చిక్కింది. ఆ తరువాత తీగ లాగితే కాంబోడియాలో డొంక కదిలింది.


నేరం తీరుతెన్నులు ఇలా..

జాబ్స్ పేరిట నిందితులు తమను కాంబోడియాకు తరలించారని ఓ బాధితుడు తెలిపారు. మంగళూరుకు చెందిన ఓ ఏజెంట్ తొలుత తనను రిక్రూట్ చేసుకున్నట్టు తెలిపాడు. అక్కడికి వెళ్లాక, తమ కంప్యూటర్ నైపుణ్యాలను పరీక్షించాక బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడే కంపెనీల్లో చేర్చేవాళ్లని అన్నారు. మహిళల పేర్లు, నకిలీ ఫొటోలతో తమతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఓపెన్ చేయించి స్వేదేశంలోని వారిని ఉచ్చులోకి దింపి డబ్బు వసూళ్లు చేయాలని బలవంతం చేసేవాళ్లన్నారు. రోజూ టార్గెట్లు విధించేవారని, లక్ష్యాలు చేరుకోని వారికి రాత్రికి భోజనం కూడా పెట్టేవారు కాదని చెప్పుకొచ్చాడు. రోజుకు 12 గంటల షిఫ్టుల్లో పనిచేయించుకునే వారని అన్నారు.

Elon Musk: చిక్కుల్లో భారత సంతతి వైద్యురాలు.. నేనున్నానంటూ ఎలాన్ మస్క్ ట్వీట్

ఫేస్‌బుక్‌తో పాటు వివిధ డేటింగ్ యాప్‌లలో మహిళల్లాగా తమతో నటింపచేస్తూ ఇక్కడి భారతీయులను నమ్మించి వారి నుంచి క్రిప్టో పెట్టుబడుల పేరిట కూడా డబ్బులు దండుకునే వారని చెప్పారు. తమ పాస్‌పోర్టులు లాక్కోవడంతో స్వదేశానికి తిరిగిరావడం కష్టంగా మారిందని బాధితుడు చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఫ్రాడ్ కంపెనీల అడ్రస్‌లు, దీని వెనకాల ఎవరున్నారు అనే అంశాలకు సంబంధించి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఇంటర్‌పోల్ సాయంతో వీరిని పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 31 , 2024 | 06:54 PM