Turmeric Milk: మీరు పాలు తాగుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి..!
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:37 PM
Health Tips: పసుపు పాలు.. ప్రాచీన కాలం నుంచి ప్రతి భారతీయుడి ఇంట్లో ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఆరోగ్య సమస్య వస్తే పసుపు పాలు తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే.. ఎక్కువ మంది ప్రజల పసుపు పాలు తాగుతుంటారు. సాధారణంగా పసుపు పాలను శీతాకాలంలో తాగాలని పెద్దలు చెబుతుంటారు. కానీ,
Health Tips: పసుపు పాలు.. ప్రాచీన కాలం నుంచి ప్రతి భారతీయుడి ఇంట్లో ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఆరోగ్య సమస్య వస్తే పసుపు పాలు తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే.. ఎక్కువ మంది ప్రజల పసుపు పాలు తాగుతుంటారు. సాధారణంగా పసుపు పాలను శీతాకాలంలో తాగాలని పెద్దలు చెబుతుంటారు. కానీ, పరిమిత స్థాయిలో ఏడాది పొడవునా పసుపు పాలు తాగొచ్చని ఆరోగ్య ని పుణులు చెబుతున్నారు. ఈ పసుపు పాలు తాగడం వలన శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. జలుబు, దగ్గు లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అయితే, పసుపు పాలను ఎలా తయారు చేసుకోవాలనేది మీకు తెలుసా? దానిని కలిపేందుకు ఒక విధానం ఉంటుందని మీకు తెలుసా? మరి నిపుణులు ఏమంటున్నారో ఈ వార్తలో తెలుసుకుందాం. వాస్తవానికి పసుపు, పాలను సరైన రీతిలో కలపకపోతే దాని ప్రయోజనాలను పూర్తిగా పొందలేరని చెబుతున్నారు నిపుణులు.
పసుపు పాలు ఇలా కలపండి..
చాలా మంది ప్రజలు పాలలో నేరుగా పసుపు వేసి కలుపుతారు. కానీ, అలా చేయవద్దని చెబుతున్నారు నిపుణులు. ముందుగా ఒక పాన్‌లో తక్కువ మంట మీద నెయ్యి వేసి వేడి చేయాలి. చిటికెడు పసుపు పొడిని, కొంత మిరియాల పొడిని వేసి వేయించాలి. దీనిని బాగా కలపాలి. ఆ తరువాత ప్రత్యేక పాన్‌లో ఉన్న మరిగించిన పాలలో వేయాలి. ఇలా చేయడం వల్ల పసుపులో ఉండే కర్కుమిన్ పదార్థం నాశనం అవదని చెబుతున్నారు. అయితే, ఎక్కువ సేపు, అధిక మంట మీద వేడి చేయడం వల్ల ఇందులో పోషకాలు ధ్వంసం అవుతాయని చెబుతున్నారు.
పసుపును నెయ్యితో వేడి చేయడం, పాలలో నల్ల మిరియాలు కలపడం వల్ల శరీరం పసుపును బాగా గ్రహించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పసుపును బాగా వేడి చేయొద్దని కూడా సలహా ఇస్తున్నారు. ఇకపోతే.. పసుపును నేరుగా(పచ్చిగా), అధికంగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. పుసుపులో ఐరన్ శోషణను నిరోధించే యాంటీ-న్యూట్రియెంట్స్ ఉన్నాయి. అందుకే ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.