Share News

Littles : మీకు తెలుసా?

ABN , Publish Date - May 26 , 2024 | 12:26 AM

పొడవైన ముక్కు ముందు భాగం తెల్లగా, రెక్కలు, పైభాగం బ్రౌన్‌ రంగులో ఉండే ఈ గుడ్లగూబను ‘బార్న్‌ ఔల్‌’ అని పిలుస్తారు.

Littles : మీకు తెలుసా?

లిటిల్స్

  • పొడవైన ముక్కు ముందు భాగం తెల్లగా, రెక్కలు, పైభాగం బ్రౌన్‌ రంగులో ఉండే ఈ గుడ్లగూబను ‘బార్న్‌ ఔల్‌’ అని పిలుస్తారు. దీనినే గోల్డెన్‌ ఔల్‌, మంకీ ఫేస్డ్‌ ఓల్‌, వైట్‌ ఔల్‌ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

  • రాత్రి పూట మెలకువగా ఉంటాయి. చెట్ల తొర్రలు, రాళ్ల మధ్య, గుహల్లో నివసిస్తాయివి. భూమికి కనీసం ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉండటానికి ఇష్టపడతాయి.

  • పురుగులు, కప్పలు, బల్లులు, చిన్న పక్షులను వేటాడి తింటాయి.

  • దీని బరువు 450 గ్రాములు నుంచి 600 గ్రాముల వరకూ ఉంటుంది. 50 సెం.మీ. పొడవు ఉంటుంది.

  • ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ ఇవి ఉంటాయి. దాదాపు 46 రకాలున్నాయి.

  • పదేళ్ల కంటే ఎక్కువ బతకవు. వీటి జీవితకాలం ఇంతే.

  • ఇవి చల్లని ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడవు.

  • గూళ్లు కట్టుకోవు. అయితే ఆడ గుడ్లగూబ మాత్రం ఇంటిని కాస్త తయారు చేసుకుంటుంది.

  • పుట్టిన పిల్ల 55 రోజులకే ఎగురుతుంది.

  • రాత్రిపూట మాత్రమే వేటాడతాయి. ఎందుకంటే చీకట్లోనే వీటి చూపు అద్భుతంగా ఉంటుంది. పగలంతా విశ్రాంతి తీసుకుంటాయి.

  • ఉత్తర అమెరికాలో ఒక పక్షి మాత్రమే 15 సంవత్సరాలు జీవించింది. ఇదే అత్యుత్తమ జీవనకాలం వైట్‌ ఔల్స్‌కు.

Updated Date - May 26 , 2024 | 12:26 AM