Share News

Navya: కనురెప్పలు ఒత్తుగా....

ABN , Publish Date - May 26 , 2024 | 02:37 AM

ఒత్తైన కనురెప్పలు కళ్ల అందన్ని పెంచుతాయి. ఆర్టిఫిషియల్‌ ఐ ల్యాషెస్‌ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్లు ఇదిగో ఇలా సహజసిద్ధంగా కను రెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు.

Navya: కనురెప్పలు ఒత్తుగా....

బ్యూటీ

ఒత్తైన కనురెప్పలు కళ్ల అందన్ని పెంచుతాయి. ఆర్టిఫిషియల్‌ ఐ ల్యాషెస్‌ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్లు ఇదిగో ఇలా సహజసిద్ధంగా కను రెప్పలను ఒత్తుగా పెంచుకోవచ్చు.

  • రాత్రి నిద్రపోయే ముందు తాజా ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదం తీసుకుని, దాన్లో ఇయర్‌ బడ్‌ ముంచి కనురెప్పల మీద అద్దుకోవాలి. ఇలా వారంపాటు క్రమం తప్పక చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.

  • నిమ్మ తొక్కును ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదంలో వేసి, ఒక వారం తర్వాత ఆ నూనెను కనురెప్పలకు పూసుకున్నా ఫలితం ఉంటుంది.

  • పెట్రోలియం జెల్లీలో మస్కారా బ్రష్‌ ముంచి, దాంతో కను రెప్పలు అద్దుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ఫలితం దక్కుతుంది.

  • చల్లబరిచిన గ్రీన్‌ టీలో దూది ముంచి కను రెప్పల మీద అద్దుకోవాలి.

  • మూసిన కళ్లను మునివేళ్లతో సున్నితంగా మర్దన చేసుకున్నా, రక్తప్రసరణ పెరిగి కను రెప్పలు పెరుగుతాయి.

  • కను రెప్పలను ట్రిమ్‌ చేసుకున్నా, కుదుళ్లు ప్రేరేపితమై కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.

Updated Date - May 26 , 2024 | 02:42 AM