Share News

Technology : ఇలా చేస్తే బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఓవర్‌ హీట్‌

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:23 AM

వేడి ఏ రూపంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. స్మార్ట్‌ ఫోన్‌కూ వర్తిస్తుంది. ఎండలనే కాదు, గేమ్స్‌ తదితరాలతో ఎక్కువగా ఉపయోగించినా ఫోన్‌ వేడెక్కుతుంది. ఫలితంగా ఇబ్బందులకూ అవకాశం ఉంటుంది. దరిమిలా ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

Technology : ఇలా చేస్తే బెస్ట్‌  స్మార్ట్‌ఫోన్‌ ఓవర్‌ హీట్‌

వేడి ఏ రూపంలో ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తప్పవు. స్మార్ట్‌ ఫోన్‌కూ వర్తిస్తుంది. ఎండలనే కాదు, గేమ్స్‌ తదితరాలతో ఎక్కువగా ఉపయోగించినా ఫోన్‌ వేడెక్కుతుంది. ఫలితంగా ఇబ్బందులకూ అవకాశం ఉంటుంది. దరిమిలా ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఎండాకాలమనే కాదు, బైటి వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ కేసును మొదట తొలగించాలి. ఇప్పుడు వస్తున్న ఫోన్లు ఎక్కువగా ఫాస్ట్‌-చార్జింగ్‌ టెక్నాలజీతో వస్తున్నాయి. ఆ నేపథ్యంలో కేసును తొలగించడం ద్వారా ఫోన్‌ను వేడిమి నుంచి రక్షించుకోవచ్చు.

  • కనీస స్థాయిలో డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ని ఉంచుకోవాలి. అది ఎక్కువగా ఉంటే ఫోన్‌ వేడెక్కుతుంది. ఆ కారణంగా, అవసరమైన మేరకు బ్రైట్‌నెస్‌ను అడ్జెస్ట్‌ చేసుకోవాలి.

  • బైట అంటే రోడ్డుపై ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌పై సూర్యకాంతి నేరుగా పడకుండా చూసుకోవాలి. అందుకోసం ఏదో ఒక అడ్డును ఏర్పాటు చేసుకోవాలి. వాహనంలో లేదంటే పైన ఏదో ఒక అడ్డు ఉండేలా చూసుకుంటే మంచిది.

  • వేడి వాతావరణంలో ఎక్కువ సేపు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం లేదంటే దాంట్లో ఆటలు అంత మంచిది కాదు. భారీ స్థాయిలో ఉండే గేమ్స్‌ ఆడేటప్పుడు హార్డ్‌వేర్‌ని బాగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వేడెక్కుతుంది. అందువల్ల అదేపనిగా ఆడకూడదు.

  • స్మార్ట్‌ఫోన్లను జేబులో ఉంచుకోకూడదు. సహజంగా సాగే ఎయిర్‌ ఫ్లోని అది నిరోధిస్తుంది. అలా కూడా వేడెక్కే ప్రమాదం ఉంది. సహజంగా సాగే గాలి ప్రక్రియకు అవకాశం కల్పించాలి.

Updated Date - Jun 08 , 2024 | 05:23 AM