Share News

5 Healthy Snacks : బరువు తగ్గాలని ఫిక్స్ అయితే ఈ స్నాక్స్ తీసుకోండి..!

ABN , Publish Date - Feb 09 , 2024 | 04:35 PM

వోట్స్‌లో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ అధిక మూలంగా ఉంటుంది. కనుక ఆకలిని తీర్చి కడుపును నిండుగా ఉంచుతుంది.

5 Healthy Snacks : బరువు తగ్గాలని ఫిక్స్ అయితే ఈ స్నాక్స్ తీసుకోండి..!
Healthy Snacks

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే దాని ఫలితం మొత్తం శరీరం పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. పోషకమైన ఆహారం తీసుకుంటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఆకలిని తగ్గించి, బరువును అదుపులో ఉంచేందుకు తప్పక తీసుకోవాల్సిన సాక్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇందులో..

బాదం..

బాదం, వాల్ నట్స్‌లతో సహా నట్స్‌లో కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా పోషకాహారంగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని తీర్చి, బరువును నియంత్రిస్తాయి.

పెరుగు..

పెరుగులో కొవ్వును తగ్గించే పోషకాలున్నాయి. గ్రీకు పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. బెర్రీలు చుట్టూ ఉన్న యాంటీఆక్సిడెంట్లతో తినడానికి రుచిగా ఉంటుంది. జీవక్రియను పెంచడానికి కూడా పెరుగు సహకరిస్తుంది. తద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. పోషకమైన నిండుగా ఉంచేందుకు దీనిలో బెర్రీలను కూడా కలిపి తీసుకుంటే మరింత రుచికరంగా ఉంటుంది.

ప్రోటీన్స్..

వెజిటబుల్, ప్రోటీన్ రిచ్ ఫ్రూట్ స్మూతీస్ శక్తివంతంగా ఉంచడంలో, ఆకలిని తీర్చడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాల నుండి నివారణ వరకు... !

ఓట్స్..

ఓట్స్ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతుంది. అలాగే వోట్స్ లో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ అధిక మూలంగా ఉంటుంది. కనుక ఆకలిని తీర్చి కడుపును నిండుగా ఉంచుతుంది.

చిక్ పీస్ ..

ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే చిక్ పీస్ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.


వేరుశెనగ వెన్నతో ఆపిల్ ముక్కలు

యాపిల్స్ ఫైబర్ అధికంగా ఉండే పండు. వేరుశెనగలు ఆరోగ్యకరమైన కొవ్వులు, మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్‌లను అందిస్తాయి. వేరుశెనగ వెన్నతో యాపిల్‌ను కలపడం మంచి రుచిని ఇస్తుంది.

కాటేజ్ చీజ్..

కాటేజ్ చీజ్ ప్రొటీన్‌లో అధికంగా ఉంటుంది. కాటేజ్ చీజ్‌ను పండ్లతో జత చేయడం వల్ల పండ్ల ఫైబర్‌తో చీజ్, ప్రోటీన్, కొవ్వు పదార్ధాలను పూర్తి చేస్తుందిపైనాపిల్, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లతో దీనిని తీసుకోవచ్చు. రుచికరమైన అనుభూతిని ఇస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Feb 09 , 2024 | 04:35 PM