Share News

Super Foods: ఆరోగ్యకరమైన జుట్టు పొందాలంటే ఈ సూపర్ ఫుడ్స్‌ని క్రమం తప్పకుండా మీ ఆహారంలో తీసుకోవాల్సిందే.. !

ABN , Publish Date - Jan 13 , 2024 | 04:44 PM

చియా గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివి జింక్, సెలీనియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ మినరల్స్ స్కాల్ప్ ఆరోగ్యానికి మంచిది.

Super Foods: ఆరోగ్యకరమైన జుట్టు పొందాలంటే ఈ సూపర్ ఫుడ్స్‌ని క్రమం తప్పకుండా మీ ఆహారంలో తీసుకోవాల్సిందే.. !
superfoods

సూపర్ ఫుడ్‌లను రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల పోషకాలు మొత్తం శరీరానికే కాదు, జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. విటమిన్స్ తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బయోటిన్, విటమిన్స్ జుట్టుకు బలం, మెరుపు, పెరుగుదలను పెంచుతాయి.

ఆమ్లా.. గూస్బెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కొల్లాజెన్ జుట్టుకు బలాన్ని ఇస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా అవసరం.

నానబెట్టిన బాదం.. విటమిన్ ఇ జుట్టు కుదుళ్లకు పోషణను ఇస్తుంది. ఆరోగ్యకరమైన స్కాల్ఫ్ కు సహకరిస్తుంది. విటమిన్ ఇ దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది జుట్టు దెబ్బతినకుండా చేసే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

వాల్ నట్స్.. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ లో పుష్కలంగా ఉన్న వాల్ నట్ లు స్కాల్ప్ ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు బలానికి సపోర్ట్ చేస్తుంది. సహజమైన నల్లటి నిగారింపును ఇస్తాయి.

గుడ్లు, పన్నీర్.. ప్రోటీన్ జుట్టుకు బ్లాక్ రంగునిస్తాయి. పన్నీర్ రెండూ జుట్టుకు మంచి పోషణను ఇస్తాయి. ఆహారంలో ప్రోటీన్ చేర్చడం వల్ల జుట్టు మూలాలు గట్టిపడతాయి.

సీడ్స్ మిక్స్.. అవిసె గింజలు, చియా గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివి జింక్, సెలీనియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ మినరల్స్ స్కాల్ప్ ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చదవండి: ఈ పిప్పర్మింట్ ఆయిల్‌ని తలకు రాసి చూసారా.. ? ఎన్ని లాభాలంటే..!


ఖర్జూరం.. ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఐరన్ లోపం జుట్టు రాలడానికి ఒక సాధారణ కారణ. ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు ఈ సమస్యను తగ్గిస్తాయి.

బచ్చలికూర.. ఈ ఆకుకూరలో ఐరన్, విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఐరన్ హెయిర్ ఫోలికల్స్‌కు ఆక్సిజన్‌ను అందిస్తుంది.

బీట్‌రూట్‌లు.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి రక్త ప్రసరణను పెంచడంలో చాలా అవసరం. బీట్‌రూట్‌లలో ఐరన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఇవి జుట్టుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 13 , 2024 | 05:07 PM