Share News

Mood Boosting Treats : మహిళల్లో సంతోషకరమైన హార్మోన్లను పెంచే శాకాహారాలు ఇవే..!

ABN , Publish Date - Jan 25 , 2024 | 03:52 PM

సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్లు వంటి సంతోషకరమైన హార్మోన్లు మానసిన స్థితిని నియంత్రంచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Mood Boosting Treats : మహిళల్లో సంతోషకరమైన హార్మోన్లను పెంచే శాకాహారాలు ఇవే..!
foods to eat daily

మహిళలు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండే ఆహారాన్ని గురించి ఆలోచిస్తారు. మొత్తం ఆరోగ్యం ఒక్క పోషకాలతోనే సరిపోదు. శరీర ఉత్సాహానికి ఆనందంగా ఉండేందుకు కావలసిన హార్మోన్ల పోషణ కూడా అంతే అవసరం. హార్మోన్లను పెంచేలా తినే ఆహారం ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. ఈ రెంటికీ మధ్య మానసిక స్థితిని, అటు ఉత్సాహాన్ని పెంపొందిచుకునే విధంగా మూడ్ బూస్టింగ్ ఆహారాలను ఎంచుకోవాలి. అటు వంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్లు వంటి సంతోషకరమైన హార్మోన్లు మానసిన స్థితిని నియంత్రంచడంలో మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

డార్క్ చాక్లెట్, అవకాడే, బ్లూబెర్రీస్, ఆకు కూరలు వంటి ఆహారాలతో మహిళల్లో సంతోషకరమైన హార్మోన్లను పెంచుకోవచ్చు.

1. డార్క్ చాక్లెట్లో సెరోటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చక్కని రీఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.

2. అవకాడో తీసుకోవడం వల్ల ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇది మెదడు ఆరోగ్యానికి, ఆనందంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

3. బ్లూబెర్రీస్ ఆహారంలో తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఇవి మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితిని సానుకూలపరిచేందుకు సహకరిస్తాయి.

ఇది కూడా చదవండి: మాదాపూర్ కుమారి ఆంటీ కిచెన్‌కి ఎంత క్రేజ్ అంటే..!


4. ఆకుకూరల్లోని ఫోలేట్ సెరోటోనిన్ నియంత్రణలో, మానసిక స్థితిని పెంచడంలో ముందుంటుంది.

5. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే గింజలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవాలి. ఇది మానసిక స్థితిని పెంచుతుంది. న్యూరోట్రాన్స్ మీటర్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.

6. ఓట్స్ సెరోటోనిన్ ఉత్పత్తిలో సహాయపడే కార్బోహైడ్రేట్.. ఇది ఆనందానికి పెంచేందుకు కారణం అవుతుంది.

7. ట్రిప్టోఫాన్, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఉల్లాసమైన మూడ్‌ని పెంచడమే కాకుండా సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

8. టమాటాలు లైకోపీన్, విటమిన్ సి కలిగి ఉన్నాయి ఇవి ఆనందానికి కారణం అవుతాయి.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 25 , 2024 | 03:52 PM