Share News

Processed Foods : అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ఎలా తగ్గించాలి... !

ABN , Publish Date - May 08 , 2024 | 04:46 PM

ప్రాసెస్ చేసిన పదార్ధాలు అయితే పాశ్చరైజేషన్, ఎండబెట్టడం, చాలా రకాల మసాలాలు, నిల్వ ఉండేందుకు ఉపయోగించే పదార్థాల కలయికతో ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిందే.

Processed Foods : అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ఎలా తగ్గించాలి... !
Ultra processed foods

పిల్లలు మారాం చేస్తున్నారని చిప్స్ , కూల్ డ్రింక్స్, మసాలా దినుసులు వేసి వేయించిన మిస్చర్స్, ఐస్ క్రీం, బర్గర్లు, ప్యాకింగ్ ఐటమ్స్ తెగ కొనేసి ఇచ్చేస్తూ ఉంటాం. ఇవి వారి ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తాయనే ఆలోచన అప్పటికి ఉండదు. కానీ వీటితో దీర్ఘకాలంలో చేటు తప్పదంటున్నాయి. ఆరోగ్య నివేదికలు, పరిశోధనలు, ముఖ్యంగా ఆరోగ్యం మీద క్యాన్సర్, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలను తెచ్చిపెడతాయి. కానీ పెద్దలు అప్పటికి పరిష్కారంగా పిల్లల చేతుల్లో ప్యాకెట్స్ పెట్టేసి నోరు మూయిస్తూ ఉంటారు. అసలు ప్యాకింగ్ పదార్థాలతోనే సమస్య లేక వీటి అలవాటుని ఎలా తగ్గించుకోవాలి.

వంట గదుల్లో మనం వాడే చాలా పదార్థాలు ఫ్రెష్ గా , చేసినవి కూడా కడగడం, తరగడం, ఉడికించడం, ఉప్పు, కారాలు, మసాలాలు వేసి కలపడం వల్ల అందులోని పోషకాలు నశించిపోతాయి. ఇక ప్రాసెస్ చేసిన పదార్ధాలు అయితే పాశ్చరైజేషన్, ఎండబెట్టడం, చాలా రకాల మసాలాలు, నిల్వ ఉండేందుకు ఉపయోగించే పదార్థాల కలయికతో ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం అందరికీ తెలిసిందే.

1. వీటిలోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల వాటిని తినడం ఆరోగ్యానికి, జీర్ణ క్రియకు మంచిది కాదు. ఇది పేగు సంబంధమైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. అయితే వీటితో ఎంతవరకూ ఆరోగ్యం అనేది తెలుసుకోవడం ముఖ్యం.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

2. ప్రాసెసింగ్ స్థాయిని బట్టి పోషకాలు నాశనం అవుతాయి. పండ్లుస కూరగాయలు, తృణధ్యాన్యాల బయటి పొరలు పీల్ చేయడం వల్ల మొక్కల పోషకాలు ఫైటోకెమికల్స్, పీచు తొలగిపోతుంది. ఆహారాన్ని వేడి చేయడం, ఎండబెట్టడం వల్ల కొన్ని విటమిన్లు, ఖనిజాలు నాశనం అవుతాయి.

3. ఆహార తయారీదారులు ఈ పోషకాలను తిరిగి కలిపినా కూడా అసలు పోషకాలను తిరిగి పొందడం కుదరని పని.

Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !


4. ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు తణధాన్యాలు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలాధారాలు, ఇందులో సోడియం, చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి. చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

పిల్లలు మారాం చేస్తే ఇంట్లో తయారు చేసిన వంటకాలనే పెట్టడం మంచిది. మందులు చల్లిన కూరలు, ప్యాకింగ్ వస్తువులను ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల అరోగ్యానికి మంచిది. పిల్లలైనా, పెద్దలైనా వీటి వినియోగాన్ని తగ్గించడం మంచిది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 08 , 2024 | 04:46 PM