Share News

Lose Weight : అధిక బరువును త్వరగా తగ్గేస్తే..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:54 PM

బరువులో మార్పులకు అనుగుణంగా ఎముకలకు స్థిరమైన, క్రమమైన విధానం అవసరం. వెంటనే బరువు తగ్గడం వలన ఎముకలు బలహీనపడటానికి కారణం అవుతుంది.

Lose Weight : అధిక బరువును త్వరగా తగ్గేస్తే..!
lose weight

బరువు తగ్గడం అనేది ఇప్పటిరోజుల్లో ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తున్న విషయం. చాలా బరువున్న వ్యక్తి చూస్తుండగానే బరువు తగ్గారని తెలిస్తే.. ఏం చేసి తగ్గారని తెలుసుకుని తెగ ఆశ్చర్యపోతాం. అయితే వేగంగా బరువు తగ్గడం ఎంతవరకూ మంచిది. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా తగ్గడం అంటే అనారోగ్యకరమైన ప్రభావాలు ఉంటాయి. కండాల నష్టం, పోషకాహార లోపాలు, అవయవాలపై ఒత్తిడితోపాటు మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. రెండు వారాల్లో ఐదు నుండి పది కిలోల వరకూ తగ్గాలనుకుంటే దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇది శరీరానికి ఎందుకు ప్రమాదకరం..

త్వరగా బరువు తగ్గడం అంటే నీరు, కండరాల బరువు కోల్పోతారు. కానీ కొవ్వును కాదు. ఇది శరీరం తక్కువ నీటిని నిలుపుకోవడం వల్ల నీటి బరువు పడిపోతుంది. శర్తికోసం శరీరం కండరాల కణజాలాన్ని విచ్చిన్నం చేసి కండరాల నష్టం జరుగుతుంది. ఇలా అవడం వల్ల నీరు, కండరాలను కోల్పోవడం వల్ల శరీర నిర్మాణం, శక్తిని ప్రభావితం చేస్తుంది. నిజానికి ఇది ఆరోగ్యకరంగా బరువు తగ్గే ప్రక్రియ అస్సలు కాదు.

ఎముక సాంద్రత...

వేగవంతమైన బరువు తగ్గడం అనేది బోలు ఎముకల వ్యాధికి కారణం కావచ్చు.ముఖ్యంగా 30 ఏళ్ల ప్రారంభంలో లేదా చివరిలో ఉన్న వ్యక్తులకు ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. బరువులో మార్పులకు అనుగుణంగా ఎముకలకు స్థిరమైన, క్రమమైన విధానం అవసరం. వెంటనే బరువు తగ్గడం వలన ఎముకలు బలహీనపడటానికి కారణం అవుతుంది. అవి పగుళ్లకు ఎక్కువ అవకాశం కలిగిస్తాయి. బరువు తగ్గే ప్రక్రియలో హార్మోన్లతో గందరగోళానికి గురి చేస్తుంది, ఫలితంగా మొండి కొవ్వు, మానసిక కల్లోలం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేగంగా బరువు కోల్పోయి తిరిగి పొందినప్పుడు, శరీరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

ఇది కూడా చదవండి: మూత్రపిండాల్లోని రాళ్ళుకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..


పోషకాల లోపం...

వేగవంతమైన బరువు తగ్గడంలో సాధారణ దుష్ప్రభావాల్లో పోషకాహార లోపాలుంటాయి. అలసట, పెళుసుగా ఉండే జుట్టు, గోర్లు, హార్మోన్ల అసమతుల్యతలకు కారణమవుతాయి. ఫ్యాడ్ డైట్‌లు B విటమిన్లు, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను శరీరానికి అందకుండా చేస్తాయి. B విటమిన్లు శక్తికి అవసరం, కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

జీవక్రియ...

మన జీవక్రియ, శరీర ఇంజిన్ లాగా, శక్తి కోసం కేలరీలను బర్న్ చేస్తుంది. తరచుగా విపరీతమైన ఆహారాలు లేదా ఆకలితో శరీరం జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. త్వరిత బరువు తగ్గడానికి అనేక ఇతర ప్రమాదాలు ఉన్నాయి. సమతుల్య, స్థిరమైన విధానాన్ని అవలంబించడం శాశ్వత ఆరోగ్య ప్రయోజనాలను నిర్ధారిస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Feb 02 , 2024 | 01:08 PM