Share News

Super Foods : కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..

ABN , Publish Date - May 27 , 2024 | 11:24 AM

కంటి ఆరోగ్యానికి సరిపడే ఆహారాలను తీసుకోవాలి. మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. వీటిలో ప్రధానంగా విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి.

Super Foods : కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..
your eyes

అన్ని అవయవాలలోకీ కళ్ళు చాలా ప్రధానమైన అవయవం. కంటి ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం. కాబట్టి కంటి ఆరోగ్యానికి సరిపడే ఆహారాలను తీసుకోవాలి. మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. వీటిలో ప్రధానంగా విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

బెల్ పెప్పర్స్ వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్ళలోని రక్తనాళాలను మంచిది. కంటి శుక్లం వచ్చే ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి. వీటితో పాటు బోక్ చోయ్, కాలీఫ్లవర్, బొప్పాయిలు, స్ట్రాబెర్రీలతో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవన్నీ కంటి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటాయి.

పొద్దు తిరుగుడు గింజలు..

ఈ పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇతర పోషకాలతో కలిపి తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

లీఫీ గ్రీన్స్..

బచ్చలికూర, తోటకూర వంటి ఇతర ఆకు కూరలలో విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ కూడా కలిగి ఉంటాయి. ఈ మొక్క ఆధారిత ఆహారం కారణంగా కంటి శుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

సాల్మాన్..

రెటినాస్ సరిగ్గా పనిచేయడానికి రెండు రకాల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం DHA, EPA. సాల్మాన్, ట్యూనా, ట్రౌట్ వంటి కొవ్వు చేపలలో అలాగే ఇతర సముద్ర ఆహారంలో ఒమేగా 3 ఉంటుంది. ఇది కళ్లను AMD, గ్లాకోమా నుంచి కాపాడతాయి.

స్వీట్ పొటాటో..

చిలగడదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, మామిడిపండు, ఆప్రికాట్‌లు వంటివి బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి రాత్రి దృష్టి సరిగా ఉండేందుకు సహకరిస్తాయి.


Weight Loss : ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బరువు తగ్గడంలేదా.. ఇలా చేసి చూడండి..!

మీట్, పౌల్ట్రీ..

ఇందులోని జింక్ కాలేయం నుండి రెటీనా వరకూ కాపాడుతుంది. వీటిలో ఎక్కువగా విటమిన్ ఎ ఉంటుంది.

బీన్స్, చిక్కుళ్ళు..

రాత్రి పూట దృష్టిలోపం ఉన్నవారు శాఖాహారం తీసుకోవడం వల్ల తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ అందుతుంది. వీటిలో జింక్ అధికంగా ఉంటుంది.


గుడ్లు..

గుడ్డులో జింక్ ఉంటుంది. అలాగే పచ్చసొనలో లుటీన్, జియాక్సంతిన్ ఉంటుంది. ఇవి రెటీనా పవర్ పెంచుతాయి.

బ్రోకలీ, బ్రస్సెల్స్, మొలకలు..

విటమిన్ ఎ, బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ ఇవి కంటి కణాలను రక్షించేందుకు పనిచేస్తాయి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 27 , 2024 | 11:25 AM