Share News

Herbal Teas : జలుబుని ఇట్టే తరిమేసే హెర్బల్ టీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. !

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:15 PM

వాతావర‌ణంలో వచ్చిన మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం ఇవన్నీ కూడా శరీరాన్ని సెస్సిటివ్ గా తయారు చేసాయి. ఈ కార‌ణాల వల్ల తరచుగా జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు.

Herbal Teas : జలుబుని ఇట్టే తరిమేసే హెర్బల్ టీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. !
Herbal teas

జలుబు చేసిందా మందులు వాడినా, వాడకపోయినా వారం ఉండిగానీ పోదు. అనేక ఖరీదైన మందులు వాడినా కూడా జలుబు నుంచి తప్పించుకోలేమనేది పాతకాలం నాటి మాట.. ఇప్పుడు వీటికి మంచి మంచి చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే..

వాతావర‌ణంలో వచ్చిన మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం ఇవన్నీ కూడా శరీరాన్ని సెస్సిటివ్ గా తయారు చేసాయి. ఈ కార‌ణాల వల్ల తరచుగా జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు. జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి యాంటీ బ‌యాటిక్‌ల‌ను వాడుతూ ఉంటారు. తరుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. జలుబు నుండి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగించే కొన్ని ర‌కాల హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

1. చ‌మోమిలే టీ తీసుకోవడం వల్ల ఎంతో ఉపశమనం పొంద వచ్చు. ఒక క‌ప్పు చ‌మోమిలే టీ ని తాగి చ‌క్క‌గా విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, మంట‌, జలుబు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

2. పిప్ప‌ర్ మెంట్ టీని తాగ‌డం వ‌ల్ల కూడా చ‌క్క‌టి ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3. నిమ్మ‌కాయ, అల్లం టీని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. నిమ్మ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, అల్లంలో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు జ‌లుబును త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇది కూడా చదవండి: ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో కండి .!

4. జలుబుతో బాధ‌ప‌డేట‌ప్పుడు యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు క‌లిగిన లైకోరైస్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. దగ్గు, గొంతునొప్పి, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుండి ఈ టీ చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తుంది.

5. జ‌లుబుతో బాధ‌ప‌డేట‌ప్పుడు శ‌రీరం కూడా వేడిగా జ్వ‌రం వ‌చ్చిన‌ట్టుగా ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో యారో టీని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ముక్కుదిబ్బ‌డ‌, ద‌గ్గు, జ్వ‌రం వంటి వాటిని త‌గ్గించ‌డంలో ఈ టీ అద్భుతంగా ప‌ని చేస్తుంది.

6. జ‌లుబుతో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌తో టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వీటిలో ఉండే యాంటీ మైక్రోబ‌యాల్ ల‌క్ష‌ణాలు ఇన్పెక్ష‌న్‌ను త‌గ్గించ‌డంలో, జ‌లుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యాన్ని త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.


ఇవి కూడా చదవండి:

దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!

జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

ఆలోచనను మార్చి పడేసే పాప్‌కార్న్ బ్రెయిన్ గురించి తెలుసా..!

7. జలుబు చేసిన‌ప్పుడు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచి ఇన్పెక్ష‌న్ త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. హెర్బ‌ల్ టీల‌ను తాగ‌డం వ‌ల్ల జ‌లుబు త‌గ్గ‌డంతో పాటు శ‌రీరానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 12 , 2024 | 04:15 PM